జనసేన మరియు బీజేపీ మద్య గత కొన్నాళ్లుగా పొత్తు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఈ పొత్తు నిన్న మొన్నటివరకు కేవలం ఏపీలో మాత్రమే కొనసాగుతూ వచ్చింది.
కానీ ఇప్పుడు తెలంగాణలో కూడా ఈ పొత్తు కొనసాగించాలని ఇరు పార్టీలు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.ఇప్పటికే సీట్ల పంపకాలు కూడా తుది అంకానికి చేరుకున్నట్లు సమాచారం.
ఇప్పటికే 88 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ ( BJP )మిగిలిన స్థానాలను జనసేనతో కలిసి పొంచుకోబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం జనసేన పార్టీకి ఎనిమిది సీట్లను ఫైనల్ చేసినట్లు సమాచారం.

ఖమ్మం, అశ్వరావు పేట, మధిర, వైరా, నాగర్ కర్నూల్, కోదాడ, కూకట్ పల్లి.స్థానాలను జనసేన( Jana Sena ) కోసం కేటాయించిందట కమలం పార్టీ.ఇదిలా ఉంచితే గతంలో జనసేనతో ఎలాంటి దోస్తీ ఉండబోదని చెప్పిన కమలం పార్టీ.ఇప్పుడేందుకు జనసేనతో పొత్తుకు సిద్దమైందనే దానిపై రకరకాల అభిప్రాయాలూ తెరపైకి వస్తున్నాయి.గత కొన్ని రోజులుగా బీజేపీలో అంతర్మథనం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.పైగా రాష్ట్రంలో పార్టీ బలం కూడా అంతతాంత మాత్రంగానే ఉంది.
ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే ప్రస్తుతం బరిలో ఉన్న అభ్యర్థుల గెలుపు విషయంలో కూడా బీజేపీ అగ్రనేతలు కాన్ఫిడెంట్ గా లేరనే టాక్ వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలో అధనపు బలం ఉంటే ఎంతో కొంత మెరుగైన ఫలితాలు సాధించవచ్చనే ఉద్దేశంతోనే జనసేనతో జట్టు కట్టినట్లు కొందరు రాజకీయ వాదులు చెబుతున్నారు.అయితే ఏపీలో బీజేపీ తరుపున ఎలాంటి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనని పవన్(Pawan Kalyan ) తెలంగాణలో పాల్గొనే అవకాశం ఉందా అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి.మరో విషయం ఏమిటంటే తెలంగాణలో 32 స్థానాల్లో పోటీ చేయాలని మొదట పవన్ భావించారు.
ఇప్పుడు పొత్తులో భాగంగా సీట్ల కుదింపు జరుగుతోంది.ఈ నేపథ్యంలో ఆయన బీజేపీకి ఎంతవరకు సహకరిస్తారనేది ప్రశ్నార్థకమే.
మరి తెలంగాణ ఎన్నికల్లో పవన్ ను అస్త్రంగా ఉపయోగించాలని చూస్తున్న కమలనాథుల ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.