కళ్ళ ముందు జరుగుతున్న గొడవలను ఆపే ప్రయత్నం చేస్తే ఒక్కోసారి ఆ గొడవలు తమనే కాటేస్తాయి అనడానికి ఈ సంఘటనే నిదర్శనం.చిన్న గొడవను ఆపేందుకు వెళ్లి ఓ యువకుడు తన ప్రాణాలు కోల్పోయిన ఘటన విశాఖపట్నంలోని( Vishakapatnam ) ఆశవానిపాలెంలో చోటు చేసుకుంది.
అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.విశాఖపట్నం ఎయిర్పోర్ట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
ఆదివారం సాయంత్రం ఆలమూరి కరుణ్ కుమార్ (28)( Alamuri Karun Kumar ) అనే యువకుడు తన స్నేహితులతో కాసేపు క్రికెట్ ఆడి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఇతని స్నేహితుడు సాయిభాను( Saibhanu ) అనే యువకుడు ఆశవానిపాలెం శివారు ప్రాంతంలో టాయిలెట్ కు వెళ్లగా.
అక్కడ ఉన్న తవిటి రాజు, అతని భార్య రాజేశ్వరి, ఆమె తోటి కోడలు లక్ష్మి, రామారావు అనే వ్యక్తి అంతా ముక్కుమూడిగా సాయిభానుపై గొడవకు దిగారు.వీరిమధ్య మాటా మాటా తిరిగి తోపులాట జరిగింది.
ఈ విషయం కరుణ్ కుమార్ కు తెలియడంతో అక్కడికి వచ్చి గొడవకు గల కారణం ఏమిటని ప్రశ్నించాడు.

దీంతో ఈ గొడవకు నీకేం సంబంధం అంటూ తవిటి రాజు,( Taviti Raju ) రాజేశ్వరి,( Rajeswari ) లక్ష్మి ( Lakshmi ) అంతా కరుణ్ కుమార్ పై గొడవకు దిగి, కరుణ్ కుమార్ గుండెలపై బలంగా కొట్టడంతో కిందపడి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు.వెంటనే అంతా కలిసి స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా.పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో మరో ఆసుపత్రికి తరలించారు.
అయితే అప్పటికే కరుణ్ కుమార్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

దాడికి పాల్పడిన వారి ఇంటి ఎదుట మృతదేహాన్ని ఉంచి కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు నిరసనకు దిగారు.ఈ విషయం ఏయిర్ పోర్ట్ సీఐ బీఎండీ ప్రసాద్, కంచరపాలెం సీఐ నల్లి సాయి కు తెలియడంతో సంఘటన స్థలానికి చేరుకొని జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు.దాడికి పాల్పడిన కుటుంబ సభ్యులంతా పరారీలో ఉన్నారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ కుటుంబ సభ్యులను గాలిస్తున్నారు.కరుణ్ కుమార్ షిప్ బిల్డింగ్ సెంటర్ లో కాంట్రాక్టర్ వద్ద ఎలక్ట్రిషన్ గా పనిచేస్తున్నాడు.
కరుణ్ కుమార్ కు తల్లిదండ్రులు, భార్య, తమ్ముడు ఉన్నారు.నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు మృతుడి తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.







