అల్లు అర్జున్ సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ మిస్ చేసుకున్న అనసూయ.. నిజంగా బ్యాడ్ లక్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు అల్లు అర్జున్ ( Allu Arjun ) ఒకరు.ప్రస్తుతం ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా పుష్ప సినిమా ( Pushpa )ద్వారా పాన్ ఇండియా స్థాయిలో కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

 Anasuya Rejects Actress Chance In Allu Arjun Movie , Anasuya, Allu Arjun,-TeluguStop.com

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అల్లు అర్జున్ పక్కన నటించే అవకాశం వస్తే చాలని ఎంతోమంది సెలబ్రిటీలు ఎదురుచూస్తున్నారు.అయితే ఈయన పక్కన హీరోయిన్గా చేసే అవకాశం వచ్చిన వదులుకున్నటువంటి వారు కూడా ఉన్నారు అలాంటి వారిలో యాంకర్ అనసూయ( Anasuya ) ఒకరు.

Telugu Aarya, Allu Arjun, Anasuya, Heroin Chance, Kajal Aggarwal, Pawan Kalyan,

అనసూయ ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన సినీ కెరియర్ గురించి పలు విషయాలను తెలియజేశారు.ఈ క్రమంలోనే తాను పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హీరోగా నటించిన అత్తారింటికి దారేది సినిమాలో ఒక పాటలో నటించమని త్రివిక్రమ్ అవకాశమిచ్చినప్పటికీ నేను నటించనని చెప్పాను.అలాగే అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆర్య 2 ( Aarya 2 ) సినిమాలో కూడా తనకు హీరోయిన్గా అవకాశం వచ్చిన ఈమె రిజెక్ట్ చేయడంతో ఈమె స్థానంలో మరొక నటి అవకాశాన్ని అందుకున్నారని తెలుస్తోంది.

Telugu Aarya, Allu Arjun, Anasuya, Heroin Chance, Kajal Aggarwal, Pawan Kalyan,

ఆర్య సినిమాకు సీక్వెల్ చిత్రంగా సుకుమార్ ( Sukumar ) దర్శకత్వంలో ఆర్య 2ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమాలో కాజల్ అగర్వాల్( Kajal Aggarwal ) హీరోయిన్గా నటించిన శ్రద్ధాదాస్ కూడా ఈ సినిమాలో నటించారు.అయితే ముందుగా శ్రద్ధ దాస్ కు బదులుగా అనసూయను హీరోయిన్గా తీసుకోవాలని భావించినప్పటికీ ఆ సమయంలో ఈమె ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లి పనులలో బిజీగా ఉన్న నేపథ్యంలోనే ఈ ఆఫర్ కి రిజక్ట్ చేశారని తెలుస్తుంది.అయితే అల్లు అర్జున్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ మిస్ చేసుకున్న ఈమె ఆయన నటించిన పుష్ప సినిమాలో భాగమయ్యారని తెలుస్తుంది.

ఇలా అల్లు అర్జున్ సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్నారనే విషయం తెలియడంతో అభిమానులు నిజంగా అనసూయకి ఇది బాడ్ లక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube