దర్జాగా రోడ్డుపై ట్రక్కును ఆపేసిన ఏనుగు.. తర్వాత ఏం చేసిందంటే?

ఏనుగులు చాలా వైల్డ్ గా ప్రవర్తిస్తుంటాయి.వాటికి అడ్డువచ్చిన వాటిని తొక్కుకెళ్లడమే ఇక.

 Wild Elephant Blocks A Sugarcane Truck Viral Video Details, Elephant, Tamil Nadu-TeluguStop.com

కానీ ఒక్కోసారి ఇవి చేసే పనులు భయంగా, కాస్త విచిత్రంగా ఉంటాయి.రోడ్డు దాటుతున్నప్పుడు ఏవైనా వాహనాలు, మనుషులు అడ్డు వస్తే ఇక అంతే సంగతులు.

వాటిని పక్కకు తోసేస్తూ ముందుకు కదులుతుంటాయి.భారీ కాయం ఉండే ఏనుగులు వస్తున్నాయంటే అలా చూస్తూ ఉండి పోవడం తప్పా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంటుంది.

తమిళనాడులో ఓ ఏనుగు చేసిన ఘనకార్యం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.ఆ గజరాజుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.అసలు ఆ ఏనుగు ఏం చేసిందంటే.అది తమిళనాడులోని ఈరోడ్.

ఆ రోడ్డుపై వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి.అప్పుడే అక్కడికి ఓ ఏనుగు వచ్చింది.

ట్రక్కను అడ్డగించింది.ఆ ట్రక్కు చెరకు లోడుతో వెళ్తుండటం గమనించిన ఆ గజ రాజు… దర్జాగా ఆ చెరకు గడలను తీసుకుంది.

Telugu Elephant, Elephant Latest, Elephantstopped, Erode, Sugarcane Truck, Tamil

కావాల్సినంత తిన్న తర్వాత మెల్లిగా అక్కడి నుండి వెళ్లి పోయింది. ఏనుగు అలా చెరకు గడలు తీసుకుంటున్నప్పుడు ఆ డ్రైవర్ ఏమీ చేయలేని పరిస్థితి.అలాగే కదలకుండా కూర్చున్నాడు.వాహనాన్ని అలాగే ఉంచేశాడు.దీంతో అసనూర్ సమీపంలోని సత్య మంగళం – మైసూర్ హైవేపై ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.ఏనుగు ఇలా చెరకు గడలను తీసుకుంటున్నప్పుడు తీసిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube