బ్రిటన్‌లో చరిత్ర సృష్టించిన భారత సంతతి యువతి.. పాతికేళ్లకే మేయర్‌గా ఎన్నిక..!!

బ్రిటన్‌లో భారత సంతతి యువతి చరిత్ర సృష్టించింది.దేశ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కురాలైన మేయర్‌గా ఎన్నికై రికార్డుల్లోకెక్కింది.

 Gujarati-origin Humaira Garasia Creates History In Uk , As Youngest Civic Mayor,-TeluguStop.com

గుజరాతి సంతతికి చెందిన హుమైరా గరాసియా (25) లండన్ బరో ఆఫ్ హాక్నీలో కౌన్సిల్ స్పీకర్‌గా ఎన్నికైన అతి పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించింది.హుమైరా కుటుంబం గుజరాత్‌‌కు చెందినది.

ఆమె తండ్రి రఫిక్ అహ్మద్ .వల్సాద్‌లోని నానాతైవాడ్‌కు చెందినవారు కాగా.తల్లి నజ్మా బరూచ్‌కి చెందినవారు.అహ్మద్ చిన్న వయసులోనే యూకేకు వలస వచ్చారు.అట్టడుగు జనాభాకు ప్రాతినిథ్యం వహించాలనే ఉద్ధేశంతో గరాసియా 15 సంవత్సరాల చిరుప్రాయంలోనే క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించాలని నిశ్చయించుకున్నారు.

లండన్ యూనివర్సిటీ నుంచి బీఏ చేశారు గరాసియా.21 సంవత్సరాల వయసులో తాను 2018లో కౌన్సిలర్‌గా ఎన్నికయ్యానని ఆమె చెప్పారు.నాలుగేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న తర్వాత మరోసారి మే 2022లో కౌన్సిలర్‌గా మరోసారి గెలుపొందినట్లు గరాసియా అన్నారు.

అసమానతలు, సమస్యలను పరిష్కరించడానికి బరో అంతటా వున్న నాయకులు, నివాసితులు, కమ్యూనిటీలతో కలిసి పనిచేస్తానని ఆమె స్పష్టం చేశారు.అదే సమయంలో జాత్యహంకారం, వివక్ష వంటి దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడంలోనూ సహాయం చేస్తానని గరాసియా చెప్పారు.

సమాజంలో అత్యంత దుర్బలమైన వారికి మద్ధతుగా నిలవడంపై దృష్టి సారిస్తానని ఆమె వెల్లడించారు.

Telugu Civic Mayor, Gujaratiorigin, Humaira Garasia, London, Uksyoungest-Telugu

ఇకపోతే.గత నెలలో పంజాబీ సంతతికి చెందిన చారు సూద్ ఎల్ బ్రిడ్జ్ నగరానికి డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు.ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎల్ బ్రిడ్జ్ బరో కౌన్సిల్‌లో వరుసగా రెండోసారి ఆమె కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు.2018లో ఇదే స్థానం నుంచి తొలిసారిగా ఎన్నికైన చారు సూద్ మంచి పనితీరు కనబరిచారు.ఎల్ బ్రిడ్జ్‌లోని కన్జర్వేటివ్‌ పార్టీ స్టార్ క్యాండిడేట్స్‌లో ఆమె కూడా ఒకరు.

అంతేకాదు తిరిగి వారి స్థానాలను నిలబెట్టుకోగలిగిన కొద్దిమందిలో చారు సూద్ వున్నారు.ఎన్నికల్లో కన్జర్వేటివ్‌లు సత్తా చాటని సందర్భంలోనూ ఆమె స్పష్టమైన మెజారిటీతో విజయం సాధించారు.

చారు సూద్ విజయం పట్ల ఆమె తండ్రి శశిభూషణ్ సూద్ హర్షం వ్యక్తం చేశారు.వీరి కుటుంబం ఇప్పటికీ చండీగఢ్‌లోనే నివసిస్తోంది.

వరుసగా రెండవసారి ఎన్నికైన అతి పిన్న వయస్కులలో చారుసూద్ కూడా ఒకరని ఆయన అన్నారు.చండీగఢ్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసిన ఆమె తొలుత బార్సిలోనాకు అనంతరం యూకేకు వెళ్లారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube