వైరల్ ఫోటో: మేకప్ లేకుండా ఉన్న వైఫ్ ఆఫ్ గౌతమ్ కిచ్లు..!

అక్టోబర్ 30న ముంబై మహానగరంలో అతికొద్ది బంధుమిత్రుల సమక్షంలో ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ తను ప్రేమించిన వ్యక్తితో వివాహం చేసుకున్న సంగతి అందరికీ విదితమే.

ఆ తర్వాత కొంతమంది వ్యక్తుల మధ్య రిసెప్షన్ కార్యక్రమం కూడా జరిగింది.

రెండు కార్యక్రమాల తర్వాత కాజల్ అగర్వాల్ తన భర్త గౌతమ్ కిచ్లూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వారి పెళ్లికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.వారికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

ఇకపోతే ప్రస్తుతం కాజల్ అగర్వాల్ ఒప్పుకున్న సినిమాలు అరడజన్ పైనే ఉన్నాయి.అందులో టాలీవుడ్ మెగాస్టార్ నటిస్తున్న ఆచార్య సినిమాతో పాటు, తమిళ్ సినిమా స్టార్ అయిన కమల్ హాసన్ భారతీయుడు -2 తో పాటు మరిన్ని సినిమాలను ఒప్పుకుంది.

ఇక పెళ్లి తర్వాత రెండు నెలలు ఆవిడ ఎలాంటి షూటింగ్స్ లో పాల్గొనకుండా తన భర్తతో బిజీబిజీగా హనీమూన్ ఎంజాయ్ చేయండి.అయితే వీరిద్దరి పెళ్లి తర్వాత కాజల్ భర్త గౌతమ్ కిచ్లూ కు సోషల్ మీడియాలో తెగ ఫాలోయింగ్ పెరిగిపోయింది.

Advertisement

అందుకే కాబోలు గౌతమ్ కిచ్లూ తన భార్య సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఖుషి చేస్తున్నాడు.అయితే తాజాగా తన భార్య కాజల్ అగర్వాల్ మేకప్ లేని ఓ ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేశాడు.

ఈ ఫోటోను షేర్ చేసిన గౌతమ్ కిచ్లూ.మిస్సెస్ కిచ్లూ ఉదయం పూట ఎలా ఉంటుందో చూడండి అంటూ కాస్త ఫన్నీగా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఫోటోను షేర్ చేశాడు.ఈ ఫోటోలో కాజల్ అగర్వాల్ ఓ డైనింగ్ టేబుల్ వద్ద కూర్చొని ఉన్న ఫోటోను వారి అభిమానుల కోసం షేర్ చేశాడు.

ఇకపోతే వీరిద్దరూ పది సంవత్సరాల నుంచి ప్రేమించుకున్నట్లు ఇదివరకే కాజల్ అగర్వాల్ వారి లవ్ స్టోరీ గురించి చెప్పిన విషయం తెలిసిందే.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు