ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో భర్తతో పాటు ఆమె అత్తమామలే హత్య చేశారని మృతురాలి బంధువులు ఆందోళనకు దిగిన ఘటన మెదక్ లోని( Medak ) మిరుదొడ్డిలో చోటుచేసుకుంది.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటి చూద్దాం.
గజ్వేల్ ఏసీపీ ఎం.రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.మెదక్ లోని మిరుదొడ్డి కు చెందిన కమలాకర్ కు( Kamalakar ) వర్గల్ మండలం గుంటిపల్లి గ్రామానికి చెందిన 22 ఏళ్ల పద్మకు( Padma ) రెండేళ్ల క్రితం వివాహం జరిగింది.పెళ్లయిన కొత్తలో వీరి సంసారం సాఫీగానే సాగింది.
కానీ కొన్ని రోజుల తర్వాత వీరి మధ్య కలహాలు నెలకొనడంతో రెండు, మూడు సార్లు పెద్దలు నచ్చ చెప్పారు.ఇంకొంతకాలం పాటు వీరి సంసారం సాఫీగానే సాగింది.

అయితే గత కొంతకాలంగా భార్య పద్మను అదనపు కట్నం( Dowry ) తీసుకురావాలని భర్త కమలాకర్ తరచూ వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టాడు.ఈ క్రమంలోనే రెండు రోజులుగా ఈ దంపతుల మధ్య గొడవలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి.శనివారం తెల్లవారుజామున పద్మ ఇంట్లో అనుమానాస్పందంగా మృతి చెందింది.పద్మ భర్త తోపాటు అత్తమామలు కూడా ఇంటి నుంచి పరారయ్యారు.పద్మ మృతి చెందిన విషయం ఆమె తల్లిదండ్రులకు మరియు బంధువులకు తెలియడంతో సంఘటనా స్థలానికి వచ్చి ఆందోళనకు దిగారు.

పోలీసులకు సమాచారం అందడంతో గజ్వేల్ ఏసీపీ ఎం.రమేష్( Gajwel ACP M Ramesh ) తో పాటు సిద్దిపేట రూరల్ సీఐ చేరాల్ సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం తో ఆధారాల కోసం అంతా పరిశీలించారు.నిందితులను అదుపులోకి తీసుకొని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో పద్మ కుటుంబ సభ్యులతో పాటు బంధువులు ఆందోళన విరమించారు.
పద్మ తండ్రి దుల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కమలాకర్ తో పాటు అతని కుటుంబ సభ్యుల కోసం గాలిస్తున్నారు.







