కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.ఖమ్మం జిల్లాలో మంత్రులు పొంగులేటి, తుమ్మలతో కలిసి ఆయన పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.
వంద రోజుల్లోనే గ్యారెంటీలపై ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు.గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపించారు.
గ్యారెంటీలకు వారంటీ లేదన్న పెద్దలకు ప్రజలు చెంపదెబ్బ కొట్టారని చెప్పారు.ఈ క్రమంలోనే సంపద సృష్టిస్తామన్న ఆయన సంపదను ప్రజలకు పంచుతామని పేర్కొన్నారు.
ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు.అధికారులే ప్రజల ఇంటికి వచ్చి పనులు చేస్తారని తెలిపారు.
కాంగ్రెస్ పాలనలో ఎలాంటి నిర్బంధాలు ఉండవని స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యంలో ప్రజలు స్వేచ్ఛగా జీవించవచ్చని వెల్లడించారు.







