భర్తను పైకెత్తి కింద పడేసిన భార్య.. రైల్వే స్టేషన్‌లో ఘోరంగా కొట్టుకున్నారు

భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి కామన్‌గా జరుగుతూ ఉంటాయి.ఎంత అన్యోన్యంగా ఉన్నా సరే ఏదోక విషయంలో బేధాభిప్రాయాలు( Misunderstanding ) వస్తూ ఉంటాయి.

ఇలాంటి సమయంలో దంపతులు తీవ్ర స్థాయిలో గొడవ పడుతూ ఉంటారు.కొన్ని గొడవలు పాల మీద పొంగులా వెంటనే సర్దుకుపోతాయి.

మరికొన్ని గొడవలు భార్యాభర్తల మధ్య విడాకులకు దారి తీస్తాయి.కొన్నిసార్లు గొడవల సమయంలో క్షణికావేశంలో భార్యాభర్తలు( Couples ) కొట్టుకుంటారు.

నువ్వా, నేనా అనే రేంజ్ లో కొట్టుకుంటారు.ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతూ ఉంటాయి.

Advertisement

తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో రైల్వేస్టేషన్ లో( Railway Station ) భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది.దీంతో దంపతులు అక్కడే కొట్టుకున్నారు.దీనిని కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో( Social Media ) పెట్టడంతో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో రైల్వే స్టేషన్ లో దంపతులు ట్రైన్ కోసం ఎదురుచూస్తున్నారు.ఇంతలో రైలు వచ్చి ఆగగా.ఈ సమయంలో భార్యాభర్తల మధ్య ఏం జరిగిందో తెలియదు గానీ భార్యకు ఒక్కసారిగా కోపం వచ్చింది.

దీంతో భర్తను తలపై చేతితో గట్టిగా కొట్టింది.ఆ తర్వాత భర్త కాళ్లు పట్టుకుని పైకి ఎత్తి కింద పడేసింది.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
బర్త్ డే క్వీన్ నవీన రెడ్డి : మంచి పాత్రలు చేస్తూ ఇండస్ట్రీ లో స్టార్ ఇమేజ్ దక్కించుకున్న నటి...

ఆ తర్వాత కింద పడ్డ భర్తపై కూర్చోని చేతులతో బాదుతూ కనిపించింది.ఈ సమయంలో భార్య జుట్టు పట్టుకుని భర్త లాగుతాడు.దీంతో భార్య కోపంతో భర్త జుట్టు పట్టుకుని కొడుతుంది.

Advertisement

దీంతో ఇలాగే ఇద్దరూ కాసేపు కొట్టుకున్నారు.ఈ ఘటనతో అక్కడ ఉన్నవారందరూ షాక్ అయ్యారు.

అసలు ఏం జరుగుతుందో ప్రయాణికులకు అర్థం కాక జుట్టు పీక్కున్నారు.వాళ్లు కొట్టుకుంటున్నా విడిపించే ప్రయత్నం మాత్రం ఎవరూ చేయలేదు.

ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారగా.ఈ వీడియో చూస్తుంటే భయం వేస్తుందని కొంతమంది అంటున్నారు.

ఇదో కొత్తరకం wwe ఛాంపియన్ షిప్ అని మరికొందరు అంటున్నారు.

తాజా వార్తలు