పట్టు బట్టలు ఎందుకు ధరిస్తారో తెలుసా?

మన హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి మరియు పూజాది కార్యక్రమాలలో మగవారు,ఆడవారు పట్టు వస్త్రాలను ధరిస్తూ ఉంటారు.ఆడవారికి పట్టు వస్త్రాలకు అవినాభావ సంబంధం ఉంది.

పట్టు వస్త్రాలు ఎన్నో రంగుల్లో మరియు ఎన్నో రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి.ఈ పట్టు వస్త్రాలు సమాజంలో ఉన్నత స్థితిని ,ఐశ్వర్యాన్ని సూచిస్తాయి.

అయితే పట్టు వస్త్రాలను ధరించటానికి ఏమైనా కారణాలు ఉన్నాయా అంటే ఉన్నాయనే చెప్పాలి.ఆధునిక శాస్త్రం,ధర్మ శాస్త్రం ప్రకారం ప్రతి ప్రాణి చుట్టూ ఓరా అనబడే సప్త వర్ణ కాంతి పుంజం ఉంటుంది.

ఇది మన శారీరక మానసిక పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది.పట్టు వస్త్రాలను ధరించినప్పుడు ఈ ఓరా ఎంతో కాంతివంతంగా శక్తివంతంగా చుట్టూ ఉన్న పాజిటివ్ శక్తిని ఆకర్షించి మన శరీరంలో ప్రసరించేలా చేస్తుంది.

Advertisement

అందువల్ల పూజలు చేసే సమయంలోను గుడికి వెళ్లే సమయంలోను పట్టు వస్త్రాలు ధరించాలని ఆడవారికి,మగవారికి చెప్పుతారు.ఏది ఏమైనా మన సంప్రదాయాలలో కన్పించని చాలా సైన్స్ దాగి ఉందని చెప్పవచ్చు.

These Face Packs Help To Get Smooth Skin Details Face Packs
Advertisement

తాజా వార్తలు