టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.మార్చి 25 వ తారీఖున భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరుగా ఇద్దరు హీరోలు మరియు జక్కన్న పాల్గొంటున్నారు.
దేశ వ్యాప్తంగా ముఖ్య పట్టణాలు మరియు నగరాల్లో ఇద్దరు హీరోలతో కలిసి కాళ్లకు చక్రాలు కట్టుకుని చక్లర్లు కొడుతున్నారు.మరో వైపు ఇంటర్వ్యూలు ప్రెస్మీట్ లు అంటూ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే విధంగా బోర్ కొట్టించే విధంగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఉన్నాయంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ వస్తున్నాయి.
గత పది రోజులుగా ఎక్కడ చూసినా కూడా ఎన్టీఆర్, రామ్ చరణ్ మరియు రాజమౌళి ల హడావుడి కనిపిస్తుంది.సినిమాకు ఇప్పటికే ఆకాశమే హద్దు అన్నట్లుగా అంచనాలు ఉన్నాయి.
సినిమా అదే స్థాయి లో ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇలాంటి సమయంలో ఖర్చు భారీ గా పెట్టి మరి ప్రమోషన్ కార్యక్రమాలు చేయడం ఎందుకు అంటూ కొందరు రాజమౌళి పై అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇద్దరు హీరోలను ఉత్తర భారతం లోని అక్కడ దేవాలయం ముందు నిల్చోబెట్టి ఫోటోలను తీసి సినిమా పబ్లిసిటీ కోసం వినియోగించుకోవడం పద్ధతి గా లేదు అంటూ కొందరు విమర్శిస్తూ ఉంటే కొందరు మాత్రం జక్కన్న ఎంత భారీగా సినిమాలు తీస్తాడో అంతే భారీగా ప్రమోషన్ కూడా చేస్తాడు.కనుక ఇందులో విసుక్కోవడానికి ఏమీ లేదు.
అలాగని ఇబ్బంది పెట్టడానికి కూడా ఏమీ లేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.తెలుగు ప్రేక్షకుల్లో సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.
కానీ ఉత్తర భారతదేశంలో జనాల్లోకి సినిమా ని తీసుకు వెళ్లాలి అంటే ఇలాంటి ప్రమోషన్లు తప్పవు కదా అంటూ మరి కొందర అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ముందస్తు వ్యూహం ప్రకారం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను జక్కన్న ముందుకు తీసుకు వెళ్తున్నారు.
రికార్డ్ స్థాయి వసూళ్లు సాధించాలి అంటే ఈ మాత్రం ప్రమోషన్ ఉండాల్సిందే అనేది కొందరి అభిప్రాయం.