మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఎన్ని సినిమాలు చేస్తున్నాడు అంటే టక్కున చెప్పలేనన్ని సినిమాలు చేస్తున్నాడు అనడం లో ఎలాంటి సందేహం లేదు.ఆయన నటించిన ఆచార్య సినిమా ని ఈ సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెలిసిందే.
మరోవైపు ఆయన వరుసగా రీమేక్ సినిమాల్లో నటిస్తున్నాడు.మలయాళం సూపర్ హిట్ మూవీ లూసీఫర్ కి రీమేక్ గా రూపొందుతున్న గాడ్ఫాదర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.
గాడ్ ఫాదర్ లో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.తాజాగా అందుకు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరణ జరుగుతున్నాయి.
మరో వైపు తమిళ సూపర్ హిట్ మూవీ బోలా శంకర్ అనే సినిమా కూడా చేస్తున్న విషయం తెలిసిందే.మెహర్ రమేష్ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమా లో చిరంజీవి కి సోదరుడి పాత్ర లో కీర్తి సురేష్ కనిపించబోతుంది.
మరోవైపు బాబీ దర్శకత్వం లో ఒక సినిమా ని కూడా చేస్తున్నాడు.ఈ మూడు సినిమాలు షూటింగ్ లో ఉండగా వెంకీ కుడుముల దర్శకత్వం లో ఒక సినిమా కన్ఫర్మ్ చేశాడు.ఆ సినిమా చిత్రీకరణ త్వరలో ప్రారంభం కాబోతుంది.ఈ సమయంలోనే హరీష్ శంకర్ దర్శకత్వం లో కూడా ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం అందుతోంది.
ఈ సినిమాకు సంబంధించి రెండు కీలక విషయాలు ఏంటి అంటే ఇది ఒక సూపర్ హిట్ మలయాళ సినిమా కి రీమేక్… అలాగే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కార్యక్రమాల ని పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కించబోతున్న భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమా పూర్తి అయిన తర్వాత ప్రారంభం కాబోతున్నాయి.మొత్తానికి చిరంజీవి మరియు హరీష్ శంకర్ ల కాంబినేషన్ లో సినిమా ఉంటుంది అని ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు మెగా అభిమానులు కూడా నమ్మకం గా ఉన్నారు.
మరి ఈ సినిమా కు సంబందించిన మరిన్ని వివరాలు ఎప్పుడు వెళ్ళడి అవుతాయో చూడాలి.హరీష్ శంకర్ ఒక వైపు పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించిన వర్క్ చేస్తూనే మరో వైపు చిరంజీవి సినిమా పనులలో మునిగి పోయాడు.