చెమట ఎందుకు పడుతుంది ? దుర్వాసనకు కారణాలు .. పరిష్కార మార్గాలు

అసలు మనకు చెమట ఎందుకు పడుతుంది ? ఎప్పుడైనా గమనించారా ? మనకి చెమట అయితే ఉక్కపోతగా ఉన్నప్పుడు, బాగా కష్టపడుతున్నప్పుడు, ఎండలో ఉన్నప్పుడు, లేదంటే భయంగా ఉన్నప్పుడు పడుతుంది.ఇలా ఎందుకు ? మనకి ఈ సందర్భాల్లోనే చెమట ఎందుకు వస్తుంది ? విషయం ఏమిటంటే .

పై సందర్భాల్లో మన శరీరం యొక్క ఉష్ణోగ్రత పెరిగిపోతుంది.అప్పుడు శరీరాన్ని సాధ్యమైనంతవరకు చల్లబరచాలి కదా ? అందుకే మన ఒంట్లోంచి చెమట వస్తుంది.ఆ టెంపరేచర్ ని కుదిరినంతవరకు చల్లబరించెందుకే.

మన ఒంట్లో రెండు రకాల స్వెట్ గ్లాన్డ్స్ ఉంటాయి.అవే ఎక్రైన్ మరియు అపోక్రైన్.

ఎప్పుడైతే మన ఒంట్లో ఉష్ణోగ్రత పెరుగుతుందో .అప్పుడే ఎక్రైన్ గ్లాన్డ్స్ నుంచి చెమట వస్తుంది.దీంట్లో నీరు, సోడియం కలిసి ఉంటాయి.

ఇక చెమట వలన దుర్వాసన ఎందుకు ఎలా వస్తుందో తెలుసుకోవాలా ? ఇది అపోక్రైన్ చేసే పని.ఈ గ్రంధులు చంకల కింద, జననాంగాల దగ్గర ఉంటాయి.ఈ గ్రంధులలో ఉండే బ్యాక్టీరియా వలన చంకలో దూర్వసన వస్తుంది.

Advertisement

అక్కడినుంచి వచ్చే చెమట వలనే దుర్వాసన మొదలవుతుంది.ఇదండీ .చెమట రావడం, దానితో పాటు వచ్చే దుర్వాసన వెనుక సైన్స్.మరి చెమట దుర్వాసన ఎలా తగ్గాలి ? * రోజూ స్నానం చేయాలి.ఒకసారి కాదు, రెండు సార్లు చేయాలి.

చంక దగ్గర బ్యాక్టీరియా పేరుకుపోకుండా చూసుకోవాలి.జననాంగాలు శుభ్రంగా ఉంచుకోవాలి.

అప్పుడే అపోక్రైన్ గ్లాన్డ్స్ దగ్గర ఎక్కువ బ్యాక్టీరియా ఉండదు.దాంతో చెమట వలన వచ్చే దుర్వాసన ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది.

* వదులైన బట్టలు ఎక్కువ వాడాలి.టైట్ బట్టల వలన చెమట ఎక్కువ వస్తుంది.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
మీకు ఈ స‌మ‌స్య‌లు ఉంటే..ఖ‌చ్చితంగా చేప‌లు తినాల్సిందే!

ఎందుకంటే అవి ఉష్ణోగ్రతలు పెంచుతాయి.వదులుగా ఉండే బట్టలు వేడిని సులువుగా బయటకి పంపిస్తాయి.

Advertisement

* కాటన్ బట్టలు ఎక్కువగా వాడాలి.కాటన్ బట్టలు అయితే చెమటను షోచిస్తాయి.

దాంతో చెమట ఇబ్బంది తగ్గుతుంది.ఎందుకంటే కాటన్ బాడి టెంపరేచర్ ని కంట్రోల్ లో పెడతాయి.

అందుకే వేసవిలో కాటన్ బట్టలు తోడగమనేది.* బాగా ఉతికిన అండర్ వియర్స్ ని వాడాలి.

జననాంగాల దగ్గరినుంచి వచ్చే దుర్వాసన చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.హైజీన్ మెయింటేన్ చేసి అక్కడ కూడా శుభ్రత పాటించాలి.

* నీళ్ళు బాగా తాగాలి.అదేంటి .చెమట పుట్టేది నీటితో కదా అని మీకు అనుమానం రావొచ్చు.కాని హైడ్రేటెడ్ గా ఉంటేనే శరీర ఉష్ణోగ్రతలు సులువుగా పెరగవు.

అప్పుడే అతి చెమట, దుర్వాసన ఉండవు.

తాజా వార్తలు