Telangana Slang: తెలంగాణ యాస పెడితే సినిమా హిట్ అవుతుందా ? మొదటికే మోసం వస్తుంది

తెలంగాణ సాధించుకున్న తర్వాత బయట మాత్రమే కాదు సినిమా ఇండస్ట్రీ లో కూడా దాని ప్రభావం బాగా ఉంది.

ఈ మధ్య కాలంలో పది సినిమాల్లో 6 సినిమాలు తెలంగాణ యాస తో ( Telangana Slang ) విడుదల అవుతుండటం మనం గమనిస్తూనే ఉన్నాం.

అయితే తెలంగాణ యాస తో వస్తున్న సినిమాలు మంచి విజయం సాదిస్తుండటం కూడా దీనికి ఊతం ఇస్తుంది.పైగా లోకల్ గా కూడా వసూళ్లు పెరిగే అవకాశం ఉండటం కూడా ఈ సినిమాలకు అదనపు బలం.అయితే తెలంగాణ యాస ఉంటేనే సినిమాలు విజయం సాధిస్తాయా అంటే అది జరిగే పని కాదు.సినిమాలో దమ్ము ఉంటె చాలు ఏ యాసలో తీసిన విజయం తథ్యం.

తెలంగాణ యాస ఇప్పడు మాత్రమే కాదు గతంలో కూడా సినిమాలోని ఎదో ఒక పాత్రకు పెట్టేవారు.ఎక్కువగా విలన్స్, రౌడీ గ్యాంగ్, క్రూరమైన పోలీస్ లాంటి పాత్రలకు తెలంగాణ యాస పెట్టేవారు.ఎలా తీసిన సినిమా లో దమ్ము ఉండాలి.

అది మాత్రమే విజయానికి ముఖ్య కారణం అవుతుంది.ఇక ఈ మధ్య కాలంలో తెలంగాణ యాస మరి పెరిగి పోవడం తో బాగా ఇబంది పడుతున్న వారు ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన నటులు.

Advertisement

మొన్నటికి మొన్న దసరా సినిమా( Dasara Movie ) తీసుకుతూనే అది తెలంగాణలోని గోదావరిఖని అనే ఒక మాస్ ప్రాంతం యొక్క బాషా.అందుకే తెలంగాణాలో మరింత లోతుగా ఆ ఏరియా స్లాంగ్ ఉంటుంది.

అయితే ఈ సినిమాలో పక్క బాషా నుంచి వచ్చిన కీర్తి సురేష్( Keerthy Suresh ) బాగా నటించింది.ఆమె చెప్పే డైలాగ్స్ తో పాటు డ్యాన్సులు కూడా బాగా సినిమాకు ఉపయోగపడ్డాయి.కానీ నాని ( Nani ) ఎందుకో కీర్తి సురేష్ ని డామినేట్ చేయడం మాత్రమే కాదు ఆమెతో సమానంగా తెలంగాణ స్లాంగ్ లో డైలాగ్స్ కూడా చెప్పలేకపోయాడు.

నాని మాత్రమే కాదు ఈ మధ్య కాలంలో చాల మంది తెలంగాణ స్లాంగ్ పేరు చెప్పి నానా పెంట చేస్తున్నారు.సరిగ్గా ఆ భాషను వాడలేక ఆ యాసను కిచిడి చేస్తున్నారు.

సినిమా మొదలవ్వడానికి ముందు వర్క్ షాప్స్ లాంటివి కూడా పెట్టకుండా నేరుగా సెట్ కి వెళ్ళిపోయి తూతూ మంత్రంగా డబ్బింగ్ చెప్పించడం వల్ల ఈ సమస్య వస్తుంది.

రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 
Advertisement

తాజా వార్తలు