మూత్రంలో నురగ ఉంటోందా ? ఈ సమస్యలకు సంకేతం కావచ్చు.

మూత్రం రంగుని బట్టి కూడా మన ఆరోగ్య పరిస్థితిని చెప్పవచ్చు.మూత్రం ఎలాంటి రంగులో ఉండకూడదు.

అప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉన్నట్లు.అలా కాకుండా మూత్రం యెల్లో కలర్ లో వస్తోందంటే ఏదో ఒక సమస్య ఉన్నట్లే.

అలాగే మూత్రం తరుచుగా రాకూడదు.మూత్రంలో భరించలేని దుర్వాసన ఉండకూడదు.

అంతేకాదు, మూత్ర విసర్జన చేసినప్పుడు నురగ కూడా రాకూడదు.వీటిలో ఏవి ఉన్నా, అది అనారోగ్యానికి సంకేతమే.

Advertisement

మూత్రంతో కూడా సమస్యలు తెలుసుకోవచ్చు కాబట్టే మూత్రపరీక్షలు చేస్తారు.ప్రస్తుతానికి మనం మూత్రంలో నురగ ఎలా వస్తుందో, అది ఎలాంటి సమస్యలకు ప్రమాద హెచ్చరికో చూద్దాం.

* గర్భం దాల్చిన స్త్రీల మూత్రంలో నురగ వస్తే మరీ ఎక్కువ కంగారుపడవద్దు.ఆ సమయంలో ఇలా జరగడం కామన్.

ప్రోటీన్‌లు ఎక్కువగా మూత్రంలోకి వెళ్ళడం వలన, ఊపిరితిత్తుల మీద ఒత్తిడి వలన ఇలా జరుగుతుంది.* మీరు మంచినీళ్ళు సరిగా తాగట్లేదు అంటే డిహైడ్రేట్ అవుతారు.

డీహైడ్రేషన్ వలన కూడా మూత్రంలో నురగ రావొచ్చు.కాబట్టి నీళ్ళు బాగా తాగాలి.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
మీకు ఈ స‌మ‌స్య‌లు ఉంటే..ఖ‌చ్చితంగా చేప‌లు తినాల్సిందే!

* డయాబెటిస్ సమస్య ఉన్నవారికి కూడా మూత్రంలో నురగ రావొచ్చు.మీకు అలాంటి అనుమానం ఉండి, మూత్రంలో నురగ వస్తోంటే వెంటనే పరీక్ష చేయించుకోండి.

Advertisement

* ప్రోటీన్లను మూత్రపిండాలు సరిగా ఫిల్టర్ చేయలేకపోతే ప్రోటీన్లు మూత్రంలో కలిసిపోతాయి.దాంతో నురగ వస్తుంది.

ఈ సమస్యని ప్రొటినూరియా అని అంటారు.ఇది గుండె ఆరోగ్యానికి మంచిది కాదు.

* మూత్రపిండాల్లో సమస్యలు ఉన్నప్పుడు కూడా ప్రోటిన్లు నురగని తీసుకొస్తాయి.మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోకూడదు.

బ్లాడర్ మీద ఒత్తిడి పెంచకూడదు.మూత్రంలో ప్రోటిన్, అల్బమిన్ కలిస్తే నురగని ఆపడం కష్టం.

* స్త్రీలలో ఉండే UTI ఇంఫెక్షన్లు కూడా మూత్రంలో నురగకి కారణం కావచ్చు.ఎందుకైనా మంచిది, ఆ దిశగా కూడా పరీక్షలు చేయించుకోవాలి.

తాజా వార్తలు