కుల‌పిచ్చిపై నాని స్ట్రాంగ్ వార్నింగ్‌

ప్ర‌స్తుతం ప్ర‌పంచంలో ఏ రంగంలో చూసినా క్యాస్ట్ ఫీలింగ్ అన్న‌ది కామ‌న్ అయిపోయింది.ఎవ‌రైనా ఓ వ్య‌క్తి ఉన్న‌త స్థానంలోకి వెళితే ఆ క్యాస్ట్ వాళ్లు వాడు మ‌న‌వాడురా అని ఒక‌టే గొప్ప‌లు చెప్పుకుంటున్నారు.

 Hero Nani Counter To Fan On Caste-TeluguStop.com

ఇక మ‌న‌దేశంలో రాజ‌కీయాలు, సినిమాల‌ను కులాలే ఎక్కువుగా శాసిస్తున్నాయి.ఓ కులానికి చెందిన వ్య‌క్తి రాజ‌కీయంగా అయినా, సినిమా రంగంలో అయినా మంచి పొజిష‌న్‌లో ఉంటే ఇక ఆ కులానికి చెందిన వాళ్లు చేసే హంగామాకు అంతే ఉండ‌దు.

మ‌న టాలీవుడ్‌లోను హీరోల అభిమానుల మ‌ధ్య ఉన్న కుల పిచ్చి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.తాజాగా నేచుర‌ల్ స్టార్ నానిపై ఓ వ్య‌క్తి చేసిన విమ‌ర్శ‌పై నాని స‌ద‌రు వ్య‌క్తికి దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇచ్చాడు.

ఇటీవ‌ల దివంగ‌త మాజీ సీఎం, టీడీపీ వ్య‌వ‌స్థాప‌కులు ఎన్టీఆర్ జ‌న్మ‌దిన సంద‌ర్భంగా నాని ఓ ట్వీట్ చేశాడు.

‘దేవుడికి తమ జన్మదినోత్సవం ఎప్పుడో స్పష్టంగా తెలియనపుడు వారు ఈ రోజును ఘనంగా సెలబ్రేట్‌ చేసుకోవచ్చ’ని నాని ట్వీట్‌ చేశారు.

ఈ ట్వీట్‌పై స్పందించిన ఓ వ్య‌క్తి నాని ఈ ట్వీట్ చేయ‌డానికి కులాభిమాన‌మే అని విమ‌ర్శించాడు.వెంట‌నే దానికి కౌంట‌ర్ ఇచ్చిన నాని ‘నేనూ మీలాగే తెలుగువాణ్ని.

ఎన్టీఆర్‌నే కాదు.చిరంజీవికి కూడా వీరాభిమానిని.

పెద్దలను గౌరవించే సంస్కారం ఉన్నవాణ్ని’ అని దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇవ్వ‌డంతో స‌ద‌రు వ్య‌క్తి ఆ ట్వీట్ వెంట‌నే డిలీట్ చేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube