టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం గురించి అందరికి తెలిసిందే.తన దర్శకత్వంతో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ లు అందుకున్న సినిమాలను తెరకెక్కించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈయన దర్శకత్వంలో వచ్చే సినిమాలకు అభిమానులు ఉన్నారు.ఇక ఈయన ఓ సినిమాలో శ్రీకృష్ణుడిగా కూడా నటించాడట.
ఈయన 1973 అక్టోబర్ లో జన్మించాడు.ఈయన అసలు పేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి.ఈయన 2001లో రమ అనే యువతిని పెళ్లి చేసుకోగా ఆమెకు అంతకు ముందే మరో వ్యక్తితో వివాహం జరిగింది.అంతేకాకుండా పెళ్లీడుకొచ్చిన ఒక కొడుకు కూడా ఉండగా రాజమౌళి అతడిని దత్తత తీసుకున్నాడు.
అంతేకాకుండా మరో అమ్మాయిని కూడా దత్తత తీసుకున్నారు రమ, రాజమౌళి.
ఈయన దర్శకుడి కంటే ముందు బుల్లితెరపై పలు సీరియల్స్ లో దర్శకత్వం వహించి మంచి సక్సెస్ అందుకున్నాడు.
ఇక వెండితెరపై 2001 స్టూడెంట్ నెంబర్ వన్ అనే సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించి మంచి సక్సెస్ అందుకున్నాడు.ఇందులో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించాడు.ఆ తర్వాత సింహాద్రి, సై, చత్రపతి, రాజన్న, మర్యాద రామన్న, యమదొంగ, మగధీర, ఈగ, బాహుబలి వంటి సినిమాలలో దర్శకత్వం వహించగా ఈ సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి.రాజమౌళి దర్శకుడిగానే కాకుండా స్క్రీన్ రైటర్ గా కూడా బాధ్యతలు చేపట్టాడు.

అంతేకాకుండా తన దర్శకత్వంలో పద్మశ్రీ అవార్డులను, జాతీయ పురస్కారాలను, నంది పురస్కారం, ఫిలింఫేర్ అవార్డును ఇలా ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నాడు.ఇప్పటివరకు ఆయన దర్శకత్వంలో ఒక్క ఫ్లాప్ కూడా లేదు.ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి మల్టీస్టారర్ గా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ఆర్ ఆర్ ఆర్ కు దర్శకత్వం వహిస్తున్నాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.
ఇక ఈ సినిమా తర్వాత టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు తో కూడా మరో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.అంతే కాకుండా పలువురు స్టార్ హీరోల సినిమాలకు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది.

రాజమౌళి తన సినిమాలకు దర్శకత్వం వహించడమే కాకుండా కొన్ని కొన్ని సినిమాలలో స్పెషల్ ఎంట్రీ ఇస్తుంటాడు.కానీ రాజమౌళి ఓ సినిమాలో నటించాడట.గతంలో పిల్లనగ్రోవి అనే సినిమాలో రాజమౌళి తమ సొంత ప్రొడక్షన్ లో నటించగా.అందులో రాజమౌళి కృష్ణుడి పాత్రలో నటించాడట.అంతేకాకుండా ఈ సినిమా షూటింగ్ దాదాపు 90 శాతం కూడా పూర్తయిందట.కానీ తమ దగ్గర డబ్బులు లేకపోవడంతో మిగతా 10 శాతం షూటింగ్ పూర్తి చేయలేకపోయారట.
దీంతో ఈ సినిమా అక్కడి వరకే ఆగిపోయిందని తెలిసింది.లేదంటే ఈ సినిమా ఈ పాటికే విడుదలవుతే మాత్రం రాజమౌళి మంచి దర్శకుడిగానే కాకుండా మంచి నటుడిగా కూడా పేరు సంపాదించుకునే వాడు.