ప‌వ‌న్ భ‌రోసా యాత్రపై గోప్య‌త ఎందుకు..? అధికార పార్టీకి భ‌య‌ప‌డుతున్నారా..?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏపీలో గ‌త కొద్ది రోజులుగా ప్ర‌జ‌ల్లోకి వెళ్తున్నారు.

ఈ క్ర‌మంలోనే ఆత్మ‌హ‌త్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి కౌలు రైతు భ‌రోసా కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు.

ఇందుకు విరాళాలు కూడా సేక‌రించారు.బాధిత కుటుంబానికి రూ.ల‌క్ష చొప్పున సాయం అందించారు.అయితే ఈ యాత్ర‌లో భాగంగా కొంత‌కాలం నేరుగా బాధితుల ఇంటికి వెళ్లి సాయం అందించి అండ‌గా ఉన్నారు.

కానీ ప్ర‌స్తుతం బాధితుల‌ను ఒక చోట‌కి పిలిపించి సాయం అందిస్తున్నారు.అయితే కొద్దిరోజులుగా ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించిన విష‌యాలు గోప్యంగా ఉంచుతున్నార‌ని అంటున్నారు.అధికార పార్టీకి బ‌య‌ప‌డే ఇలా చేస్తున్నారా.

అంటున్నారు.అయితే ప‌వ‌న్ క‌ల్యాణ్ నేను ఎవ‌రికీ భ‌య‌ప‌డ‌ను.

Advertisement

ప్ర‌శ్నించ‌డానికే రాజ‌కీయాల్లోకి వ‌చ్చాను అని చెప్తుంటారు.అలాంటింది ఎందుకు గోప్యంగా ఉంచుతున్నార‌నే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది.

ఇప్ప‌టికే త‌న ప‌ర్య‌ట‌న్ల‌లో గోప్య‌త పాటిస్తున్న ప‌వ‌న్.తాజాగా కడప జిల్లాలో చేసిన పవన్ పర్యటనలోనూ చాలా విషయాల్లో గోప్యత పాటించార‌ని అంటున్నారు.

ఇదివ‌ర‌కు తాము సాయం చేసే కౌలు రైతుల విషయాలను ముందుగానే మీడియాకు వెల్లడించేవారు.అదేసమయంలో పవన్ ఆయా బాధిత కుటుంబాల ఇళ్లకు వెళ్లి మరీ వారి పక్కన కూర్చొని ఓదార్చేవారు.

కానీ కొన్నాళ్లుగా ఈ విధానంలో మార్పులు చేసుకున్నారు.పవన్ రంగంలోకి దిగే వరకు కూడా ఆయా వివరాలను వెల్లడించడం లేదు.

వైరల్ అవుతున్న ఎన్నారై జంట ఫైనాన్షియల్ ప్లాన్.. వారి సీక్రెట్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!

అదేసమయంలో బాధితుల ఇళ్లకు వెళ్లడం కూడా మానేశారు.బాధితుల‌ను ఒక దగ్గరకు పిలిచి అక్కడే సాయం అంద‌జేస్తున్నారు.ఈ సందర్భంగా నిర్వహించే సభలో కేవలం ఎంత మందికి సాయం చేశారనేది మాత్ర‌మే చెప్తున్నారు.

Advertisement

అయితే ఇలా మార్పులు చేసుకోవ‌డానికి గ‌ల కార‌ణాలు ఏంట‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది.ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు భయపడుతున్నారా? లేక.ముందుగా చెబితే అధికార పార్టీ ఆ విష‌యంలో ఏదైనా చేస్తుంద‌నా.? అంటున్నారు.మ‌రి దీనిపై ప‌వ‌న్ ఎలా స్పందిస్తారో చూడాలి.

తాజా వార్తలు