నీరసించిన శాకుంతలం చిత్రం.. రిలీజ్ కోసం పురిటి నొప్పులు తప్పేలా లేవు !

పౌరాణిక సినిమాలు రాజ్యమేలుతున్న సమయంలో స్టార్ హీరోగా ఉన్నటువంటి ఎన్టీఆర్ ను హీరోగా పెట్టి, అప్పట్లో స్టార్ హీరోయిన్ మరియు డ్రీమ్ గర్ల్ అయినా బి సరోజ ను హీరోయిన్ గా పెట్టి శాకుంతలం సినిమా తీశారు రాజ్యం ప్రొడక్షన్స్ వారు.

ఇక ఈ చిత్రానికి ఘంటసాల సంగీతం అందించారు.

వీరికి నర్తనశాల లాంటి సూపర్ హిట్ సినిమా తీసిన అనుభవం ఉంది ఆ ధైర్యంతోనే ఈ చిత్రం తీయడానికి ముందుకు వచ్చారు.కానీ ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

దాంతో ఆ తర్వాత శాకుంతలం లాంటి సినిమా తీయడానికి ఎవరు ముందుకు వచ్చే ధైర్యం చేయలేదు.ఇన్నేళ్ల తర్వాత అంత ఫామ్ లో లేని గుణశేఖర్ లాంటి దర్శకుడు శకుంతలం సినిమా తీయడానికి పూనుకున్నాడు.

ముందు నుంచే గుణశేఖర్ కి పెద్ద సినిమాలు అంటే కాస్త పిచ్చి ఉంది.దానికి తగ్గట్టే ఇలాంటి ఒక పౌరాణిక సినిమాను పెద్ద చిత్రంగా మలచాలనే అనుకున్నాడు.

Advertisement

అనుకున్నదే తడవుగా సమంత లాంటి ఒక స్టార్ హీరోయిన్ ని శకుంతల పాత్ర కోసం తీసుకుని చిత్రాన్ని తీసి మొన్న ఆ మధ్య ట్రైలర్ ని కూడా వదిలాడు ట్రైలర్ టాక్ విన్న తర్వాత గుణశేఖర్ కి ఒకింత షాక్ తగిలిందని అనుకోవాలి.

ఈ ట్రైలర్ లో సమంత శకుంతల పాత్రలో కొంత ఎక్స్పోజింగ్ చేయడం, నచురాలిటి కి చాలా దూరంగా ఉండటం, పేషెంట్ లా ఉన్న సమంత మొహం తో కరుణ రసాన్ని పలికించడం వంటి ఎన్నో విషయాలు జనాలకు చికాకు తెప్పించాయి.నాటి రోజుల్లో భాష ఎలా ఉంది, ఆహార్యం ఎలా ఉండాలో కచ్చితంగా దర్శకుడికి ఒక అవగాహన లేదు.ప్లాస్టిక్ పూలతో సినిమాని నడిపించేయాలంటే కుదరదు పైగా అమీర్పేట్ లో వాడే గ్రాఫిక్స్ వాడితే

జనాలు యాక్సెప్ట్ చేస్తారంటే దానంత పిచ్చి పని ఇంకొకటి లేదు.ఇక హీరో కూడా తెలుగువారికి తెలిసినవాడు కాదు.మొత్తానికి ఒక హిందీ సీరియల్ లో దీన్ని సాగదీసేశారు.

దాంతో జనాలలో సినిమాపై క్రేస్ రాలేదు.ఈ లోసుగులన్నీ కూడా సవరించాలంటే కొంతమేర రీ షూట్ చేయాలి.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!

విఎఫ్ఎక్స్ ఆడ్ చేయాలి ప్రొడ్యూసర్ డబ్బులు ఖర్చు పెట్టాలి.ఇవన్నీ జరగడానికి చాలా టైం పడుతుంది.

Advertisement

అందుకే సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది.

తాజా వార్తలు