Director Raghavendra Rao: దర్శకేంద్రుడికి నంబర్ 13 అంటే ఎంత భయమో తెలుసా ?

చాలా మంది ఫారనర్స్ కి శుక్రవారం 13వ తేదీ( Friday 13 ) వస్తే చాలా భయపడిపోతూ ఉంటారు.

అది కేవలం ఫారనర్స్ వరకు మాత్రమే కాదు మన టాలీవుడ్ దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుకి( Director Raghavendra Rao ) కూడా శుక్రవారం 13వ తారీకు అంటే చచ్చేంత భయం.

దానికి కారణాలు లేకపోలేదు అవేంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.మద్రాసులో ఉన్నప్పుడు మేమున్న అద్దె ఇళ్ల నెంబర్స్ 7, 9, 14 అని ఉండేవి.

ఆ నెంబర్స్ ఇంప్రూవ్మెంట్ లాగానే నేను పనిచేసే ప్రతి ప్రొడక్షన్ హౌస్ లోనూ ఎంతో కొంత అటాచ్మెంట్, అచీవ్మెంట్స్ ఉండేవి.అందుకే ఆ రోజుల్లో ఒక్కొక్క కంపెనీలో ఐదు నుంచి ఆరు సినిమాలు చేసేవాడిని.

Why Raghavendra Rao Scared Of Number 13

ఒకసారి చిన్న విషయంలో ఒక నిర్మాతతో ఆర్గ్యుమెంట్లో అప్సెట్ అయ్యాను.ఆరోజు ఇంటికి నడుచుకుంటూ వచ్చాను.నాకు తెలియకుండానే కళ్ళ వెంబడి నీళ్లు కారిపోతున్నాయి.

Advertisement
Why Raghavendra Rao Scared Of Number 13-Director Raghavendra Rao: దర్శ�

ఇంటి గేటు దగ్గరికి వచ్చి చూస్తే అంతకు ముందు ఇంటి నెంబర్ 14 కాస్త మద్రాస్ కార్పొరేషన్ వాళ్లు 13 గా మార్చారు.ఇప్పటి వరకు నాకు 14వ నెంబర్ కలిసి వచ్చింది అది చూసి ఆవేశంగా కింద ఉన్న రాయి తీసుకుని ఆ నెంబర్ ని చెరిపేసాను.

నెంబర్ లేకపోయినా పరవాలేదు అనుకున్నాను.ఆరోజు ఎంతో కుమిలిపోయి ఏడుస్తూ వస్తుంటే బయట మా నాన్నగారు కూర్చొని ఉన్నారు.నన్ను గమనించి ఏరా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు.

Why Raghavendra Rao Scared Of Number 13

నిర్మాత ( Producer ) నన్ను సినిమా నుంచి తీసేసాడు అన్నాను.దానికి అతను కదా ఏడవాలి నువ్వెందుకు ఏడుస్తున్నావు అన్నారు.ఇది నా జీవితంలో పవర్ఫుల్ మంత్రం.

నిన్ను పోగొట్టుకుంటే బాధ పడాల్సిందే నువ్వు కాదు.వాళ్లు.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!

అంత విలువ నీకు ఏర్పడాలంటే అది నీ ప్రవర్తన వల్లే సాధ్యం.అందుకే నాకు జీవితంలో శత్రువులే ఉండకూడదని జీవిత ఆశయంగా పెట్టుకున్న.

Advertisement

ఏ హోటల్ రూమ్ తీసుకున్న నెంబర్ 13 రాకుండా చూసుకుంటాను.మలేషియా అవుట్డోర్ షూటింగ్( Malaysia Shooting ) కోసం ఒకసారి వెళ్ళినప్పుడు గురువారం 12 నైట్ కి టికెట్ కొన్నారు.

నేను వాళ్ళను అడిగాను 12 దాటితే ఫ్రైడే 13 వస్తుందని, కాని వాళ్ళు 11 కి టేక్ ఆఫ్ అవుతుందని లాజిక్ చెప్పారు.మొత్తానికి ఫ్లైట్ టేక్ ఆఫ్ ఆలస్యమై శుక్రవారం 13వ తారీఖున అక్కడికి చేరుకున్నాను.జర్నీ చేస్తునంత సేపు గుండె దడదడ కొట్టుకుంది.

మెల్లిగా కునుకు తీశాను.మేలుకొని చూస్తే 13వ తారీకు ఉదయం కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయింది.

విమానం.దేవుడా.

థాంక్స్ అనుకున్న.మరుక్షణం ఫ్లైట్ టైర్ బ్యాక్ సైడ్ ఊగుతుంది.

కాస్తలో పెద్ద ప్రమాదం తప్పింది అందరికి.ఇంతకన్నా 13 గురించి నేను ఏమి చెప్పక్కర్లేదు అనుకుంటా.

అంటూ రాఘవేంద్రరావు ముగించారు.

తాజా వార్తలు