బ్రిటీష్ సిక్కు సమాజంలో పెరుగుతున్న ఖలిస్తాన్ ( Khalistan )అనుకూల ప్రభావంపై ఆ దేశ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్( Boris Johnson ) నియమించిన స్వతంత్ర కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది.ఈ సమస్యను అత్యవసరంగా పరిష్కరించాలని.
యూకేలో ఖలిస్తాన్ తీవ్రవాద భావజాలానికి మద్ధతు ఇవ్వని సిక్కులను రక్షించాలని నివేదిక రిషి సునాక్( Rishi Sunak ) ప్రభుత్వాన్ని కోరింది.యూకేలోని సిక్కు సంఘాలు ఖలిస్తానీ అతివాదుల నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్నాయని పేర్కొంది.
ఈ ఖలిస్తాన్ అనుకూల సమూహాలు తమ ప్రభావాన్ని కృత్రిమంగా పెంచి.మానవ హక్కుల క్రియాశీలత ముసుగులో రాజకీయ సంస్థలపై లాబీయింగ్ చేస్తాయని, తద్వారా తమవైపుకు ఆకర్షింప చేసుకుంటాయని నివేదిక తెలిపింది.
ఖలిస్తానీ వేర్పాటువాదులు చాలా బ్రిటీష్ సిక్కు సంఘాల అభిప్రాయాలకు ప్రాతినిథ్యం వహించడం లేదన్న విషయాన్ని అర్ధం చేసుకోవాలని సూచించింది.

ఈ తీవ్రవాద గ్రూపులు సిక్కు సంఘాలపై సృష్టించే ప్రతికూల ప్రభావాన్ని నివేదిక ప్రత్యేకంగా ప్రస్తావించింది.అంతేకాకుండా యూకేలో ( UK )వేర్పాటువాద ఎజెండాకు ఆజ్యం పోసే వ్యక్తులు, శక్తులను నివేదిక గుర్తించింది.అలాగే తమకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే అక్కసుతో లార్డ్ సింగ్‌ను కొందరు వ్యక్తులు, సంస్థలు వేధించాయని నివేదిక తెలిపింది.
దీంతో ఆయన మౌనం దాల్చినట్లు పేర్కొంది.యూకేలో అధికారిక స్థాయిలో ప్రాతినిథ్యం, దేశంలో ప్రముఖ సిక్కు సంఘంగా గుర్తింపు కోసం జరుగుతున్న ఆధిపత్య పోరును ఈ సంఘటన తెలియజేస్తోంది.
ఈ తరహా తీవ్రవాద చర్యలు ప్రభుత్వం, పార్లమెంట్ స్థాయిలో చట్టబద్ధం కాకుండా చూసుకోవాలని నివేదిక హెచ్చరించింది.

సిక్కు వేర్పాటువాద నేత, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్‌పాల్ సింగ్( Amritpal Singh ) పరారీలో వున్న సమయంలో గత మార్చిలో యూకేలోని భారత హైకమీషన్ కార్యాలయం వద్ద ఖలిస్తాన్ మద్ధతుదారులు విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే.ఈ సమయంలో నివేదిక బయటకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.బ్రిటీష్ సిక్కు సంఘాల శ్రేయస్సు, యూకే-భారత్( UK-India ) మధ్య బలమైన దౌత్య సంబంధాల కోసం దేశంలో ఖలిస్తాన్ అనుకూల తీవ్రవాదాన్ని పరిష్కరించడం చాలా అవసరమని నివేదిక పేర్కొంది.
ఈ నెల ప్రారంభంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ( Narendra Modi ), యూకే ప్రధాని రిషి సునాక్‌తో జరిపిన టెలిఫోన్ సంభాషణలో బ్రిటన్‌లో వున్న భారతీయ దౌత్య సంస్థల భద్రత సమస్యను లేవనెత్తిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా యూకేలోని భారత వ్యతిరేక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని మోడీ కోరారు.








