తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఎప్పటి నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి.ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ఈ విషయాన్ని మరింత నొక్కి చెబుతున్నాయి.
కేసిఆర్ ( KCR ) ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో తెలియదని, ప్రస్తుతం కేసిఆర్ కు ఓటమి భయం పట్టుకుందని అందువల్ల ముందస్తు ఎన్నికలకు( Early Elections ) వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉందని ప్రతిపక్ష నేతలు తరచూ చెబుతున్నారు.అయితే ఈ వ్యాఖ్యలను కొట్టిపారేయడానికి కూడా లేదు ఎందుకంటే గత ఎన్నికల ముందు ఎవరు ఊహించని విధంగా కేసిఆర్ అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు.

దాంతో కేసిఆర్ తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయాన్ని మహా కూటమి అసలు ఊహించలేక పోయింది.దాంతో ఎన్నికల కోసం ముందుగా వేసుకున్న ప్రణాలికలన్నీ ముందస్తు ఎన్నికల ప్రభావంతో ఛేంజ్ చేసుకోవాల్సి వచ్చింది.ఫలితంగా బిఆర్‌ఎస్ ( BRS ) తిరుగులేని విజయాన్ని నమోదు చేసి ప్రభుత్వాన్ని స్థపించింది.ఈ విధంగా ప్రతిపక్షలను ఇరకాటంలో పెట్టేందుకు కేసిఆర్ వ్యూహాలు అసలు ఊహించలేమనేది కొందరి అభిప్రాయం.
దాంతో గత ఎన్నికల ముందు జరిగిన సీనే మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉందని ఈసారి ఎన్నికలు ఎప్పుడొచ్చిన తాము సిద్దమే అని ప్రతిపక్షాలు ధీమాగా ఉన్నాయి.అయితే గతంలో మాదిరి ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదని షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని కేసిఆర్ మరియు కేటిఆర్ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

అయినప్పటికి ముందస్తు ఎన్నికలకు సంబంధించిన చర్చ ఆగడం లేదు.ఇక తాజాగా ముందస్తు ఎన్నికలకు సంబంధించి మరోసారి క్లారిటీ ఇచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్. తాజాగా బిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల సభలో మాట్లాడిన కేసిఆర్.ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ఇందులో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు.
ఇక ఎన్నికలకు ఎంతో సమయం లేదని ప్రతిఒక్కరూ కూడా ప్రజల్లో ఉండాలని కేసిఆర్ సూచించారు.ఇక రాష్ట్రం ఏర్పడిన తరువత నుంచి రెండుసార్లు అధికారం చేపట్టిన కేసిఆర్.
మూడవసారి కూడా గెలిచి హ్యాట్రిక్ సిఎంగా చరిత్ర సృష్టించాలని లక్ష్యంతో ఉన్నారు.మరి తెలంగాణ ప్రజలు ఈసారి బిఆర్‌ఎస్ కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తారో చూడాలి.







