అప్పుడప్పుడు కొందరు అతి తెలివి చూపిస్తూ ఉంటారు.పైగా ఆ తెలివిని ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపిస్తుంటారు.
అయితే తాజాగా టాలీవుడ్ బ్యూటీ రష్మిక మందన( Beauty Rashmika Mandana ) కూడా తన అతి తెలివితో డైరెక్టర్ సుకుమార్( Director Sukumar ) ను బ్లాక్ మెయిల్ చేస్తుందని తెలిసింది.మామూలుగా స్టార్ డైరెక్టర్లను బ్లాక్మెయిల్ చేయడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.
అటువంటిది రష్మిక చూపించింది అంటే అది ఏ విషయంలోనూ ఇప్పుడు తెలుసుకోవాల్సిందే.టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది కన్నడ బ్యూటీ రష్మిక.
కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా ఓ రేంజ్ లో పరుగులు తీస్తుంది.ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ బ్యూటీ పేరు బాగా హాట్ టాపిక్ గా మారింది.
అతి తక్కువ సమయంలో ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్న రష్మిక ప్రస్తుతం స్టార్ హీరోల సరసన పాన్ ఇండియా లెవెల్ లో దూసుకెళ్తుంది.
ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి యూత్ ఆడియన్స్ మనసు దోచుకుంది ఈ కన్నడ బ్యూటీ.తర్వాత విజయ్ దేవరకొండతో చేసిన గీతగోవిందం, మహేష్ బాబుతో చేసిన సరిలేరు నీకెవ్వరు, నితిన్( Sarileru Nikevvaru, Nitin ) తో చేసిన భీష్మ సినిమాలు చేసి స్టార్ హోదాకు చేరుకుంది.అలా వరుసగా మంచి మంచి సక్సెస్ లు అందుకోగా ఇప్పుడు ఎవరికి అందనంత లెవెల్ లో దూసుకెళ్తుంది.
పైగా పాన్ ఇండియా మూవీ పుష్ప సినిమాతో పక్షి లాగా ఎగిరిపోతుంది.అలా బాలీవుడ్, కోలీవుడ్ నుంచి కూడా వరుస ఆఫర్స్ రావటంతో అక్కడ కూడా చాలా బిజీగా మారింది.
దీంతో ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ గా మారింది.ఎంత బిజీ లైఫ్ లో ఉన్నప్పటికీ కూడా సోషల్ మీడియా వైపు అప్పుడప్పుడు తొంగి చూస్తూ అందులో బాగా పోస్టులు షేర్ చేస్తూ ఉంటుంది.
కెరీర్ మొదట్లో అంత గ్లామర్ షో చేసినట్లు ఎప్పుడు కనిపించలేదు రష్మిక.
ఇప్పుడు ఈ బ్యూటీ నేషనల్ క్రష్ కావడంతో నేనెందుకు తగ్గాలి అన్నట్లుగా ఓ రేంజ్ లో గ్లామర్ షో చేస్తుంది.ఇక ప్రతిరోజు ఫోటోషూట్లు చేయించుకుంటూ వెంటనే వాటిని నెట్టింట్లో పెట్టి బాగా రచ్చ చేస్తుంది.ఇక ప్రస్తుతం పుష్ప2( Pushpa2 ) తో బిజీగా ఉంది.
ఇదంతా పక్కన పెడితే పుష్ప డైరెక్టర్ సుకుమార్ ను బ్లాక్మెయిల్ చేస్తుందట రష్మిక.అయితే అసలు విషయం ఏంటంటే.
ప్రస్తుతం పుష్ప 2 షెడ్యూల్ షూటింగ్ బిజీలో ఉండగా.ఈ సినిమా సెట్స్ లో షూట్ పూర్తయిన తర్వాత చిల్ అవుట్ అవుతున్న సుకుమార్, బన్నీతో రష్మిక సరదాగా వారితో గడుపుతున్న సమయంలో సుకుమార్ తనతో వర్క్ చేసే హీరోయిన్స్ పై కామెంట్ చేశాడట.
ఆ సమయంలో రష్మిక సుకుమార్ మాటలను తన ఫోన్లో వీడియో తీసిందని తెలిసింది.దీంతో ఆ వీడియోని పట్టుకొని సుకుమార్ ను సరదాగా ఆటపట్టిస్తుందట రష్మిక.
తర్వాతి సినిమాలో అవకాశం ఇస్తే వీడియో లీక్ చేయను అంటూ బ్లాక్మెయిల్ చేస్తుందట.ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్ లో బాగా వైరల్ అవుతుంది.
దీంతో కొందరు రష్మిక తక్కువది కాదు కదా అంటూ కామెంట్లు పెడుతున్నారు.