ఎంజీఆర్ ను కాదని.. నగేష్ కు లైఫ్ ఇచ్చిన ఎన్టీఆర్..

దక్షిణాది సినిమా పరిశ్రమలో పరిచయం అవసరం లేని మేటి కమెడియన్ సికె నగేష్.

సౌత్ సినిమా పరిశ్రమలో ఆయన లాంటి హాస్య నటుడు మరొకరు లేరు అని చెప్పుకోవచ్చు.

ఆయన సినిమాల్లోకి రాక ముందు రంగస్థల నటుడు.పలు తమిళ, తెలుగు, మలయాళ క్లాసిక్ సినిమాల్లో ఆయన నటించి మెప్పించారు.

అంతేకాదు.దక్షిణాది చార్లీ చాప్లిన్ అని పేరు సంపాదించుకున్నాడు నగేష్ అనబడే ఈ గుండూరావు.1933 సెప్టెంబర్ 27న ఆయన కర్నాటక లోని తుముకూరు జిల్లా చెయ్యూరలో జన్మించాడు.ఆయనకు చిన్నప్పటి నుంచే సినిమాలు అంటే చాలా మక్కువ ఉండేది.

అందుకే సినిమా అవకాశాల కోసం మద్రాసుకు వచ్చాడు.ఆ తర్వాత రైల్వేలో ఉద్యోగం సంపాదించుకున్నాడు.

Advertisement

నాటకాలు అంటే ఇష్టం ఉన్న నగేష్ తొలుత రంగ స్థల నటుడిగా అవతారం ఎత్తాడు.అనంతరం సినిమా నటుడిగా గొప్ప హాస్య నటుడిగా మారిపోయాడు.నగేష్ సినీ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా సర్వర్ సుందరం.1964లో విడుదల అయిన ఈ సినిమాలో ఆయన నటన అద్భుతం అని చెప్పుకోవచ్చు.తెలుగులో ఆయన నటించిన చివరి సినిమా కమల్ హాసన్ సినిమా దశావతారం.

సినిమా పరిశ్రమలో స్టార్స్ గా కొనసాగుతున్న వాళ్ల మాటను చిన్న నటీనటులు వినకపోతే.వాళ్లకు లైఫ్ ఉండదు అనేది నగేష్ కు సరిగ్గా సరిపోతుంది.స్వతహాగా కష్టపడి సినిమా రంగంలో రాణిస్తున్న వ్యక్తి కావడంతో ఆయనలో ఓ ధైర్యం ఉండేది.

అదే సమయంలో తమిళ స్టార్ హీరో ఎంజీఆర్ సెట్ లోకి వచ్చిన సమయంలో తను లేవలేదు.ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్న ఎంజీఆర్.నగేష్ కు ఎవర్వూ అవకాశాలు ఇవ్వొద్దని చెప్పాడు.

ఆ సమయంలో ఆయన ఎక్కువ తెలుగు సినిమాలు చేశాడు.ఎన్టీఆర్ తన సినిమాల్లో నగేష్ కు అవకాశాలు ఇప్పించాడు.ఎంజీఆర్ కు విషయం తెలిసినా ఎన్టీఆర్ ను అడగలేకపోయాడు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఓసారి ఇంటర్వ్యూ ఇచ్చిన నగేష్.ఎంజీఆర్ ఈ చిన్న నటుడిని తొక్కేస్తే.

Advertisement

ఎన్టీఆర్ పైకి తీసుకొచ్చాడు అని చెప్పాడు.

తాజా వార్తలు