రిజల్ట్ ముందే తెలుసు కాబట్టే నాగార్జున సైలెంట్ గా ఉన్నారా..!

అక్కినేని నాగ చైతన్య నటించిన థ్యాంక్యూ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

విక్రం కె కుమార్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మించారు.

ఆల్రెడీ విక్రం తో మనం లాంటి సూపర్ హిట్ సినిమా తీసిన నాగ చైతన్య ఈ సినిమా కూడా అదె రేంజ్ సక్సెస్ అవుతుందని భావించారు.కానీ సినిమా మాత్రం నిరాశపరచింది.

ఆశించిన స్థాయిలో సినిమా లేకపోవడంతో ఆడియెన్స్ నిరుత్సాహపడ్డారు.యూత్ ఆడియెన్స్ కూడా ఈ సినిమా రొటీన్ స్టోరీనే అని అనేస్తున్నారు.

ఇక ఈ సినిమా రిజల్ట్ ముందే తెలుసు కాబట్టే సినిమాపై కింగ్ నాగార్జున ఎలాంటి ట్వీట్ చేయలేదని అంటున్నారు.నాగ చైతన్య ప్రతి సినిమాకు నాగ్ ఏదో ఒక విధంగా సపోర్ట్ చేస్తూ వచ్చారు.

Advertisement

సినిమా రిలీజ్ రోజు కూడా సినిమా కి బెస్ట్ విష్ అందిస్తారు.కానీ థ్యాంక్యూ సినిమా విషయంలో నాగార్జున కూడా సైలెంట్ గా ఉన్నారు.

ఇందుకు కారణం సినిమా పోతుందని నాగ్ ముందే గెస్ చేశాడని అంటున్నారు.అందుకే నాగార్జున థ్యాంక్యూ సినిమాకి ఎలాంటి సపోర్ట్ ఇవ్వలేదని అంటున్నారు.

మజిలీ నుంచి బంగార్రాజు వరకు వరుస హిట్లతో దూసుకెళ్తున్న నాగ చైతన్య థ్యాంక్యూ ఇలా బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్లా పడటం అక్కినేని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది.సోలోగా సత్తా చాటుతాడని అనుకున్న నాగ చైతన్య థ్యాంక్యూ రిజల్ట్ తో తను కూడా డిజప్పాయింట్ అయ్యాడు.ఈమధ్య సూపర్ హిట్ టాక్ వచ్చిన సినిమానే ఆడియెన్స్ చూసేందుకు ఆసక్తి చూపట్లేదు.

అలాంటిది నెగటివ్ టాక్ వచ్చిన సినిమాని చూడటం .అందుకే థ్యాంక్యూ టాక్ ఆ సినిమా కలక్షన్స్ మీద పడ్డదని చెప్పొచ్చు. థ్యాంక్యూ సినిమాలో రాశి ఖన్నా, మాళవిక నాయర్ హీరోయిన్స్ గా నటించారు.

మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?
Advertisement

తాజా వార్తలు