జగన్ సీరియస్ అవ్వడానికి కారణమైన ఆ 'లీకు' ఏంటి ?

తన క్యాబినెట్ మంత్రులతో మీటింగ్ పెట్టుకుని రాష్ట్రానికి సంబందించిన అనేక అంశాలపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటూ ఉంటారు.

ఈ సందర్భంగా అనేక అంశాలకు సంబంధిన విషయాలు ప్రస్తావనకు వస్తాయి.

అయితే అందులో కొన్ని వివాదస్పద నిర్ణయాలు కూడా ఉంటాయి.అందుకే కొన్ని కొన్ని నిర్ణయాలను అమల్లోకి తెచ్చేవరకు అత్యంత గోప్యంగా ఉంచాలసిందిగా సీఎం తన క్యాబినెట్ సహచరులకు సీఎం ఆదేశాలు జారీ చేస్తూ ఉంటారు.

ఆ విధంగా ఏపీ సీఎం జగన్ కూడా ఓ కీలక విషయంపై నిర్ణయం తీసుకుని దానిని అత్యంత గోప్యంగా ఉంచాల్సిందిగా క్యాబినెట్ మీటింగ్ లో చెప్పారట.అయితే అది కాస్తా బయటకు రావడంతో ఇప్పుడు ఎక్కడ లేని రచ్చ మొదలయ్యింది.

దీనిపై సీఎం జగన్ చాలా గుర్రుగానే ఉన్నట్టు పార్టీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి.జగన్ అంత ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం అయిన ఆ విషయం ఏంటి అంటే మీడియాపై ఆంక్షలు, కేసులు పెట్టేందుకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఓ వివాదాస్పద జీవో తీసుకురావాలని నిర్ణయించారు.

Advertisement

ఈ మేరకు ఏపీ కేబినెట్ మీటింగ్ లో ఈ అంశంపై చర్చ కూడా నిర్వహించారు.కానీ దీనికి సంబంధించిన వివరాలు చాలా చాలా గోప్యంగా ఉంచాలని జగన్ అందరికి సూచించాడు.

కానీ కేబినెట్ భేటీ పూర్తి కాగానే ఈ కేబినెట్ నోట్‌ బయటకు లీక్‌ అవ్వడమే కాకుండా సోషల్ మీడియాలో అది పెద్ద వైరల్ గా మారిపోయింది.ప్రభుత్వంపై నిరాధారమైన వార్తలు రాస్తే అటువంటి పత్రికలు, ప్రసార సాధనలపై కేసులు పెట్టే అధికారాన్ని సంబంధిత ప్రభుత్వశాఖ కార్యదర్శికి అప్పగించాలనీ ఆ క్యాబినెట్ నోట్‌లో ఉంది.

వాస్తవానికి దానిపై ఇంకా ఎటువంటి ఫైనల్ నిర్ణయం తీసుకోలేదు.కానీ ఇప్పుడు దాని మీద జరగాల్సిన రచ్చ అంతా జరిగిపోయి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువచ్చింది.

  అయితే ఇదే నిర్ణయాన్ని 2007 లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అమలు చేసేందుకు ప్రయత్నించగా అప్పట్లో దీనిపై తీవ్రమైన వ్యతిరేకత చెలరేగింది.దాని ఫలితంగా ఆ జీవోని ఉపసంహరించుకున్నారు.అయితే ఇది వివాదాస్పదం అవ్వడంతో తనకు తెలియకుండానే ఆ జీవోవచ్చిందని వైఎస్ కప్పిపుచ్చుకోవాల్సి వచ్చింది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!

ఇప్పుడు కూడా ఆ కేబినెట్ నోట్‌ కూడా అదే విధంగా ఉండటంతో జగన్ కు ఇబ్బందికరంగా మారింది.అత్యంత గోప్యంగా ఉంచాలని తాను చెప్పిన తరువాత ఈ వార్త బయటకు ఎలా వెళ్ళింది అనే విషయంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సిందిగా జగన్ సీరియస్ గా అధికారులకు ఆదేశాలు జారీ చేసాడట.

Advertisement

ఈ విషయంలో నలుగురైదుగురిపై అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నట్టు సమాచారం.

తాజా వార్తలు