డైరెక్టర్ శోభన్( Director Shobhan ) కొడుకు అయిన సంతోష్ శోభన్ హీరోగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి చాలా సంవత్సరాలే అవుతుంది అయిన కూడా ఆయనకి ఇప్పటి వరకు సరైన సక్సెస్ లేదనే చెప్పాలి.ఆయన చేసిన సినిమాలు వస్తున్నాయి, వెళ్తున్నాయి కానీ స్ట్రాంగ్ హిట్ మాత్రం ఒక్కటి పడటం లేదు.
హీరోగా ఆయన చేసిన సినిమాల్లో పేపర్ బాయ్( Paper boy ) సినిమా కొంత వరకు పర్లేదు అనిపించుకుంది, అలాగే కరోనా లాక్ డౌన్ నేపథ్యం లో మారుతీ డైరెక్షన్ లో వచ్చిన మంచి రోజులు వచ్చాయి అనే సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది ఇలాంటి నార్మల్ హిట్స్ పడుతున్నాయి కానీ ఆయన కెరియర్ నిలబడి పోయే ఒక్క మంచి హిట్ అయితే ఇప్పటి వరకు రాలేదు దాని కోసమే ఆయన చాలా వెయిట్ చేస్తున్నారు.

రీసెంట్ గా వచ్చిన లైక్ షేర్ సబ్ స్క్రైబ్, శ్రీదేవి శోభన్ బాబు, కళ్యాణం కమనీయం( kalyanam kamaneeyam ) వంటి సినిమాలు వచ్చిన వాటి వల్ల ఆయన కి పెద్దగా ప్లస్ అయింది అయితే ఏం లేదు.ఇవన్నీ చూస్తున్న ఇండస్ట్రీ పెద్దలు సైతం ఈయన ఎందుకు ఇలాంటి సినిమాలు చేస్తున్నాడు కొన్ని మంచి స్టోరీస్ ని సెలెక్ట్ చేసుకొని ఒక మంచి సినిమా తీయచ్చు కదా అని వాళ్ల అభిప్రాయాన్నివ్యక్తం చేస్తున్నారు.ఇలానే ఇంకా సినిమాల మీద సినిమాలు చేస్తూ పోతుంటే హిట్స్ పడకపోతే మాత్రం ఇక సంతోష్ శోభన్ కెరియర్ కూడా డైలమాలో పడే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది.
ఇప్ప్డుడు అందుతున్న సమాచారం ప్రకారం సంతోష్ శోభన్ కి ఒక మంచి హిట్ కనక పడితేనే ఆయన హీరోగా నిలబడగలుగుతారు లేకపోతే ఆయన కెరియర్ కూడా ఫేడ్ అవుట్ కి దగ్గరవ్వడం ఖాయం అని అంటున్నారు…
.







