స్త్రీలు గాజు గాజుల్ని ఎందుకు వేసుకోవాలి?

స్త్రీలు గాజులు వేసుకోవటం వెనక అందమే కాకుండా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మన హిందూ ధర్మ శాస్త్రం చెప్పుతుంది.

గాజులు వేసుకోవటం వలన ఎలాంటి కీడు జరగకుండా రక్షణగా ఉంటాయి.

అప్పుడే పుట్టిన పిల్లలకు నల్లని గాజులు వేయటం మనం చూస్తూనే ఉంటాం.ఆలా నల్లని గాజులు వేయటం వలన దోషాలు, దిష్టి తగలకుండా రక్షణగా ఉంటాయి.

అంతేకాకుండా ఆ గాజుల శబ్ధం పిల్లలకు సంతోషాన్ని కలిగిస్తుంది.మన పెద్దవారు ఆడపిల్ల లక్ష్మి స్వరూపమని.

ఆడపిల్లలు గాజులు వేసుకొని తిరుగుతుంటే ఇంటిలో లక్ష్మి దేవి తిరుగుతుందని భావిస్తారు.అందుకే ఆడపిల్ల పుట్టినప్పటి నుండి చేతికి గాజులు వేసుకోవటం అలవాటు చేస్తారు.

Advertisement

ఆడపిల్లలు గాజులు చిట్లకుండా చూసుకుంటే జీవితంలో వచ్చే సమస్యలను, ఇంటి వ్యవహారాలను చక్కగా పరిష్కారం చేస్తారని పెద్దల నమ్మకం.ఇప్పుడు ఏ రంగు గాజులను వేసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో వివరంగా తెలుసుకుందాం.

ఎరుపు రంగు గాజులు శక్తిని, నీలిరంగు గాజులు విఙ్ఞానాన్ని, ఊదారంగు గాజులు స్వేచ్ఛను, ఆకుపచ్చ రంగు గాజులు అదృష్టాన్ని, పసుపు రంగు గాజులు సంతోషాన్ని, నారింజ రంగు గాజులు విజయాన్ని, తెలుపు రంగు గాజులు ప్రశాంతతను, నలుపు రంగు గాజులు అధికారాన్ని, వెండి గాజులు బలాన్ని, బంగారు గాజులు ఐశ్వర్యాన్ని సూచిస్తాయి.హిందూ సంప్రదాయం ప్రకారం గాజులు స్త్రీల సౌభాగ్యానికి చిహ్నం.

బంగారు గాజులు ఎన్ని వేసుకున్న కనీసం రెండు మట్టిగాజులైనా తప్పనిసరిగా ధరించాలి.అమ్మవారి పూజల్లో పసుపు, కుంకుమలతోపాటు గాజులతో పూజిస్తారు.

కాబట్టి.మట్టిగాజులు వేసుకోవడం.

ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్... సందడి చేసిన సినీ తారలు!
తాము నటించిన చిత్రాల్లో తామే ఓ పాట పాడుకున్న టాలీవుడ్ హీరోలు.!

ఐదవతనాన్ని సూచిస్తుంది.మన భారతీయులు గాజులు పగలడాన్ని అమంగళం, అశుభంగా భావిస్తారు.

Advertisement

తాజా వార్తలు