దసరా రోజు పాలపిట్టను ఎందుకు దర్శించుకోవాలి.. పాలపిట్ట ప్రాముఖ్యత ఏమిటో తెలుసా?

హిందూ క్యాలెండర్ ప్రకారం ఆశ్వీయుజ మాసంలో వచ్చే నవరాత్రులను ఎంతో ఘనంగా జరుపుకున్న తర్వాత దసరా ఈ పండుగను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.

దసరా పండుగలో భాగంగా నవరాత్రి ఉత్సవాలు రావణుడి దహనం, జమ్మి చెట్టు దర్శనం, పాలపిట్ట దర్శనం అనంతరం దసరా ఉత్సవాలు ముగుస్తాయి.

దసరా పండుగ రోజు సాయంత్రం జమ్మిచెట్టును పూజించుకున్న తర్వాత పాలపిట్ట దర్శనం చేసుకుంటారు.అసలు దసరా పండుగకు పాలపిట్టకు సంబంధం ఏమిటి? దసరా పండుగ రోజు పాలపిట్టను దర్శించుకోవడానికి గల కారణం ఏమిటి అనే విషయాలను తెలుసుకుందాం.దసరా పండుగ రోజు సాయంత్రం జమ్మి చెట్టును పూజించి జమ్మి వృక్షం చుట్టూ ప్రదక్షణ అనంతరం పాలపిట్ట దర్శనంతో దసరా ఉత్సవాలను ముగిస్తారు.

అయితే పాలపిట్ట దర్శనానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే పురాణాల ప్రకారం త్రేతాయుగంలో విజయదశమి రోజు శ్రీరాముడు జమ్మి వృక్షాన్ని దర్శించుకుని రావణాసురుడి పై యుద్ధానికి వెళ్లి విజయంతో తిరిగి వస్తాడు.అయితే తన పాలపిట్టను చూసి యుద్ధానికి వెళ్లడం వల్లే గెలిచానని శ్రీరాముడు పాలపిట్టను ఒక శుభసూచకంగా పరిగణిస్తారు.

అదేవిధంగా పాండవులు అజ్ఞాతవాసం వెళ్లే సమయంలో వారి ఆయుధాలను వస్త్రాలను జమ్మి చెట్టు త్వరలో దాచి వెళ్తారు.

Advertisement

ఇలా పాండవులు వారి ఆయుధాలను జమ్మి చెట్టు తొర్రలో దాచే సమయంలో జమ్మి వృక్షం పై ఇంద్రుడు పాలపిట్ట రూపంలో ఆ ఆయుధాలకు కాపలా ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి.అదేవిధంగా విజయదశమి రోజు పాండవులు జమ్మి చెట్టుని దర్శనం చేసుకుని అందులో దాగి ఉన్న ఆయుధాలను తీసుకొని కౌరవులపై యుద్ధం అనంతరం గెలిచి వారి రాజ్యానికి వెళ్తున్న సమయంలో మొట్టమొదటిసారిగా పాలపిట్ట దర్శనం జరిగింది.అప్పటినుంచి పాండవులు అన్ని విజయాలను అందుకోవడంతో దసరా పండుగ రోజు పాలపిట్ట దర్శనం ఎంతో శుభసూచకమని భావిస్తున్నారు.

కనుక దసరా పండుగ రోజు జమ్మి చెట్టు దర్శనం తరువాత పాలపిట్ట ను చూడటం ఎంతో మంచిదని,ముఖ్యంగా ఉత్తర దిక్కు నుంచి వచ్చే పాలపిట్టను దర్శించడం వల్ల మనం చేపట్టే ఎలాంటి పనులు లోనైనా విజయం సాధిస్తామని చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు