పిల్లుల‌కు నీళ్లంటే మాచెడ్డ అస‌హ్య‌మ‌ని మీకు తెలుసా? శాస్త్ర‌వేత్త‌లు ఏమంటున్నారు?

పక్షులు, కుక్కలు తరచుగా నీటిలో స్నానం చేయ‌డాన్ని చూసే ఉంటాం.కానీ పిల్లులు నీటికి అంత దూరం ఎందుకు ఉంటాయోన‌ని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? చాలా మంది శాస్త్రవేత్తలు పిల్లుల‌కున్న ఈ స్వభావంపై పరిశోధనలు చేశారు.ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా నివేదిక ప్రకారం, పిల్లులు ఇలా చేయడానికి కారణం వాటి పుట్టుక అని శాస్త్రవేత్తల సిద్ధాంతం చెబుతోంది.పూర్వ‌కాలంలో అవి పొడి వాతావరణం ఉండే ప్రదేశాలలో జ‌న్మించేవ‌ట‌.

 Why Cat Hates Water Know The Logic, Cats, Fear , Water , Encyclopedia Britannica-TeluguStop.com

అక్క‌డ నీటి లభ్యత అంతంత మాత్రంగానే ఉండేది.అంటే, మొదటి నుండి వాటికి త‌డిసేందుకు నది లేదా చెరువు అందుబాటులో ఉండేది కాద‌ట‌.

అందుకే ఇలా చేస్తుంటాయ‌ట‌.పిల్లులు చాలా కాలం పాటు పొడి వాతావరణంలో నివసించడం కార‌ణంగా క్రమంగా అది దాని స్వభావంలో చేరిపోయింది.

ఈ స్వభావం పిల్లుల‌ జన్యువులలో అభివృద్ధి చెందింది.తరువాత‌ అది వాటి తరాలకు అందింది.

దీనికి తోడు పిల్లులకు బొచ్చుతో కూడిన చర్మం ఉండ‌టం కార‌ణంగా అవి త‌డిద‌న్నాన్ని ఇష్ట‌ప‌డ‌వ‌ట‌.

అయితే నీటితో అలాంటి సమస్య లేని కొన్ని ఎంపిక చేసిన జాతుల పిల్లులు కూడా ఉన్నాయి.అవి నీటికి అంతగా భయపడవు.వీటిలో మాన్‌కూన్, టర్కిష్ వ్యాన్‌ ర‌కాలు ఉన్నాయి.

ఇవి నీటికి అంతగా భయపడవు.ఈ విష‌యాల‌ను గుర్తుంచుకుని…మీరు పిల్లులను పెంచుకునేవారైతే.

పిల్లులు నీటిని చూసి పారిపోతున్న‌ప్పుడు వాటిని ప‌ట్టుకుని బలవంతంగా స్నానం చేయకూడదని గుర్తుంచుకోండి.

Why are Cats Afraid of Water Cats Hate Water Facts about Cats

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube