సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది యంగ్ డైరెక్టర్స్ స్టార్ హీరోలతో సినిమాలు తీయడానికి సిద్ధంగా ఉన్నారు.అయితే ఆ యంగ్ డైరెక్టర్స్ కి సినిమాల విషయంలో పెద్దగా అనుభవం లేకపోయినప్పటికీ, కాన్సెప్ట్ కథ నచ్చితే యంగ్ డైరెక్టర్స్ కు కూడా అవకాశాలు ఇస్తున్నారు మన స్టార్ హీరోలు.
అయితే స్టార్ హీరోలతో సినిమాలు చేసేటప్పుడు సీనియర్ దర్శకులే మొదటి సినిమాలా భావించి, పక్కా ప్రణాళికతో ఎంతో జాగ్రత్తగా తెరకెక్కిస్తుండడంతో ఆ సినిమాలు మంచి హిట్స్ అందుకుంటున్నాయి.అయితే అనుభవం ఉన్న అగ్రదర్శకులే స్టార్ హీరోలతో సినిమాలు చేసేటప్పుడు కథలు, స్క్రీన్ ప్లే, లాజిక్స్ అన్ని విషయాల లోను అంత కేర్ తీసుకుంటుంటే యంగ్ డైరెక్టర్స్ ఇంకెంత జాగ్రత్తపడాలి.
కానీ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మాత్రం ఇదంతా రివర్స్ లో జరుగుతోంది.యంగ్ డైరెక్టర్స్ కి స్టార్ హీరోలు అవకాశం ఇచ్చినప్పటికీ యంగ్ డైరెక్టర్స్ సినిమా హిట్టు కొట్టలేకపోతున్నారు.
అందులోనూ పాన్ ఇండియా క్రేజ్ ఉన్న హీరోతో సినిమా అంటే పూర్తిగా బోల్తా పడుతున్నారు.ఇప్పటికే ప్రభాస్ లాంటి హీరోతో యంగ్ డైరెక్టర్స్ సినిమాలు తీసి మెప్పించలేకపోయారు.
పాన్ ఇండియా స్టార్ లతో సినిమాలు చేయాలని ప్లాన్ చేసి, కథ- స్క్రిప్ట్ పరంగా మెప్పించి.ఎందుకని ప్రోడక్ట్ ని సరిగ్గా డెలివరీ చేయలేకపోతున్నారు? పాన్ ఇండియా క్రేజ్ ఉందికదా కలెక్షన్స్ అవే వస్తాయిలే అని లైట్ తీసుకుంటున్నారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మరి తమిళ యంగ్ డైరెక్టర్స్ స్టార్స్ తో సినిమాలు చేస్తూ తమిళ హిట్స్ కొడుతున్నారు.తెలుగులో ఫస్ట్ సినిమాలకే భారీ బడ్జెట్స్ పెట్టిస్తూ యంగ్ డైరెక్టర్స్ ఎందుకు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తాపడుతున్నారు.స్టార్ హీరోలు కొత్త దర్శకులతో సినిమాలు చేస్తే.కొత్త కథలు బయటికి వస్తాయని.ప్రేక్షకులకు కొత్తదనం దొరుకుతుందనే ఆలోచనలో యువ దర్శకుల స్క్రిప్టులను ఓకే చేస్తున్నారు.కానీ వారు చెప్పిన కథలనే.
తెరపై ప్రెజెంట్ చేయడంలో ఎందుకు విఫలం అవుతున్నారు? ఎక్కడ లోపం జరుగుతోంది? స్క్రిప్ట్ నమ్మి గుడ్డిగా వెళ్తున్నారా? లేకపోతే మేకింగ్ ప్రాసెస్ లో మిస్టేక్స్ కనిపెట్టలేక పోతున్నారా? లేక ఎడిటింగ్ దగ్గర సీన్స్ మిస్ అవుతున్నారా? ఇలా స్టార్ హీరోల అభిమానుల మనసులలో ఎన్నో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.మరి వీటన్నింటికీ టాలీవుడ్ లో ఉన్న యంగ్ డైరెక్టర్స్ త్వరలో తమ సినిమాలతో సమాధానం చెబుతారేమో చూడాలి మరి.