మహిళల విషయంలో ప్రపంచ దేశాలకు WHO కీలక ఆదేశాలు..!!

ప్రపంచ దేశాలు నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాయి.భారతదేశంలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వాలు నిర్వహిస్తూ మహిళలకు శుభాకాంక్షలు తెలుపుతున్నాయి.

రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయా రంగాలలో రాణించిన మహిళలను ప్రభుత్వాలు సత్కరిస్తూ ఉన్నాయి.ఇలాంటి తరుణంలో మహిళల విషయంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) ప్రపంచ దేశాలకు కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

మహిళల భద్రత విషయంలో ప్రపంచ దేశాలు టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించాలని కోరింది.ప్రతి మహిళా, బాలికకు డిజిటల్ ఆవిష్కరణలు టెక్నాలజీ అందుబాటులో ఉండేలా ప్రపంచ దేశాలు చర్యలు చేపట్టాలని.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పేర్కొనడం జరిగింది.టెక్నాలజీ ద్వారా మహిళలకు భద్రత, అభివృద్ధి, సమానత్వాన్ని కల్పిస్తుందని సూచించింది.

Advertisement

ఆసియా పసిఫిక్ వంటి దేశాలలో ఇంటర్నెట్ వినియోగంలో పురుషుల 71 శాతం మంది ఉంటే మహిళలు కేవలం 61 శాతం మాత్రమే ఉన్నట్లు తెలిపింది.ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య రంగంలో కేవలం 25 శాతం మహిళలు మాత్రమే ఉన్నత స్థానాల్లో ఉన్నట్లు WHO పేర్కొంది.

వీడియో వైరల్ : ఏంటి రింకూ సింగ్ మరీ డబ్బులు అంత ఎక్కువయ్యాయ?
Advertisement

తాజా వార్తలు