పుష్ప ఫ్రెండ్ కేశవ హీరో అయ్యాడు.. పుష్ప 2 లో ఉన్నాడా? లేడా?

అల్లు అర్జున్ హీరో గా సుకుమార్ దర్శకత్వం లో రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప సినిమా లోని ప్రతి ఒక్క పాత్ర కూడా ఆకట్టుకున్నాయి.ముఖ్యంగా పుష్ప స్నేహితుడి పాత్ర కేశవ అలరించింది.

 Pushpa Star Jagadish Coming With New Movie As Hero , Pushpa , Tollywood, Jagad-TeluguStop.com

మంచి టైమింగ్ ఉన్న పాత్ర అవ్వడంతో పాటు మంచి ప్రతిభ ఉన్న నటుడు జగదీష్ పోషించడంతో కామెడీ పండింది.పుష్ప సినిమా తర్వాత జగదీష్ యొక్క స్థాయి అమాంతం పెరిగింది.

ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తున్నాడు.కేవలం కమెడియన్ గా మాత్రమే కాకుండా హీరోగా కూడా జగదీష్ సినిమాలు చేస్తున్నాడు.

అందులో సత్తి గాని రెండెకరాలు సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.ఆహా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సత్తి గాని రెండెకరాలు సినిమా కు అభినవ్ రెడ్డి దర్శకత్వం వహించారు.

ఇటీవల సినిమా కు సంబంధించిన టీజర్ విడుదల అయింది.టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడం తో కచ్చితంగా ముందు ముందు జగదీష్ కి మంచి భవిష్యత్తు ఉంది అనే అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

పుష్ప సినిమా కి ప్రస్తుతం సీక్వెల్ రూపొందుతోంది.పుష్ప స్నేహితుడి పాత్రలో జగదీష్ మళ్ళీ కనిపించాల్సి ఉంటుంది.కానీ హీరోగా వరుస సినిమాలు చేస్తున్న జగదీష్ కి పుష్ప 2 సినిమా లో అవకాశం దక్కిందా లేదా అనేది తెలియాల్సి ఉంది.ఒకప్పుడు కమిడియన్ గా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న వారు హీరోలుగా పరిచయమయ్యారు.

కొంత మంది హీరోలుగా సక్సెస్ అవ్వగా మరి కొంత మంది అటు ఇటు కాకుండా పోయారు.

సునీల్ కెరియర్ ఆరంభంలో కమెడియన్‌ గా సక్సెస్ అయ్యాడు, ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి కొన్నాళ్లు సక్సెస్ అయ్యి మళ్ళీ ఇప్పుడు కమెడియన్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.జగదీష్ కూడా కెరియర్ ని అలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే పర్వాలేదు కానీ తప్పటడుగులు వేస్తే మాత్రం కచ్చితంగా నష్టం తప్పదు.అందుకే పుష్ప సినిమాలో కూడా జగదీష్ కనిపిస్తే ఆయన కెరీర్‌ కి మంచిదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube