ఈ ఏడాదిలోనే నలుగురు బడా హీరోల సినిమాలు రిలీజ్.. ఎవరిది బిగ్గెస్ట్ హిట్..??

ఈ సంవత్సరం తెలుగు సినిమా అభిమానులను ఎంటర్‌టైన్‌ చేయడానికి నలుగురు బడా హీరోలు సిద్ధమయ్యారు.

ఈ ఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోలైన ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తమ భారీ బడ్జెట్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించనున్నారు.

బన్నీ పుష్ప-2, జూనియర్ ఎన్టీఆర్ దేవర, రామ్‌ చరణ్ గేమ్ చేంజర్, ప్రభాస్ కల్కి సినిమాలు వరసగా రిలీజ్ కానున్నాయి.ప్రతిదీ కూడా వెరీ హై బడ్జెట్‌తో రూపొందుతోంది.

అన్ని సినిమాలపై అంచనాలు వేరే లెవెల్‌లో ఉన్నాయి.ఈ నాలుగు సినిమాల్లో ఎవరి సినిమా అద్భుతంగా ఉండి, ఎక్కువ కలెక్షన్లను వసూలు చేస్తుందో ఊహించడం కష్టం కానీ అభిమానులు మాత్రం ఎవరికి వారు తమ ఫేవరెట్ హీరోల సినిమాలు బిగ్గెస్ట్ హిట్ అవుతాయని సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.

ఏయే సినిమాలపై అభిమానుల అంచనాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Advertisement

ప్రభాస్: కల్కి 2898 AD

ప్రభాస్ ( Prabhas )హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో కల్కి 2898 AD సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.ఇది మే 30వ తేదీన వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది.ఈ సినిమా కోసం ప్రభాస్‌తో పాటు మొత్తం టీమ్ చాలానే కష్టపడింది.

ఎపిక్ సైన్స్-ఫిక్షన్‌గా వస్తున్న ఈ మూవీపై అంచనాలు వేరే రేంజ్‌లో ఉన్నాయని చెప్పవచ్చు.నాగ్‌ అశ్విన్‌ పై నమ్మకం వల్ల చాలామంది ఇది సూపర్ డూపర్ హిట్ అవుతుందని భావిస్తున్నారు.

బాగుంటే ఇది ఇండియన్ ఫిలిం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

బన్నీ : పుష్ప: ది రూల్

రూ. 1 కోటి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పినా.. కంటెస్టెంట్ కి నిరాశే..?
అల్లు అర్జున్ అరెస్టు పెద్ద కుట్ర ఉంది.. సింగర్ కల్పన షాకింగ్ కామెంట్స్?

అల్లు అర్జున్, సుకుమార్( Allu Arjun, Sukumar ) కాంబినేషన్‌లో వస్తున్న పుష్ప: ది రూల్ ఆగస్టు 15వ తేదీ విడుదల కానుంది.ఇటీవల టీజర్ విడుదలై చాలామందిలో హైప్స్ పెంచేసింది.ఇందులో ఒక కలర్‌ఫుల్ చీర కట్టి ఆదిశక్తికి ఉగ్రరూపంగా కనిపిస్తూ అల్లు అర్జున్ చేసిన ఫైట్ గూస్ బంప్స్ తెప్పించింది.

Advertisement

టీజర్ చూస్తుంటేనే ఈ సినిమా హోల్ బాక్సాఫీస్ ను షేక్‌ చేస్తుందని స్పష్టంగా అర్థమవుతుంది.అభిమానులు కూడా బన్నీ కెరీర్‌లో ఇది నెవర్ బిఫోర్ హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

తారక్-దేవర

జూనియర్ ఎన్టీఆర్( Jr ntr ) దసరా పండుగ సందర్భంగా ప్రేక్షకులను పలకరించనున్నాడు.ఈ మూవీ కోసం తారక్ బాగానే కష్టపడుతున్నాడు.ఏకంగా ఏడు కిలోల బరువు కూడా తగ్గాడు.

ఈ సినిమా చాలా గొప్పగా ఉంటుందని తారక్ ఇటీవల ఒక ఈవెంట్ లో తెలిపాడు.దాంతో అభిమానులు ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నమ్మకంగా ఉన్నారు.

చరణ్: గేమ్ చేంజర్

డైరెక్టర్ శంకర్, రామ్ చరణ్ కలిసి చేస్తున్న సినిమా గేమ్ చేంజర్( Game Changer ).ఈ మూవీ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుందని చెబుతూ వస్తున్నారు.చెర్రీ నెవర్ సీన్ బిఫోర్ లుక్‌లో కనిపించనున్నట్లు టాక్.

ఈ కారణంగా మెగా ఫ్యాన్స్ ఈ మూవీ మంచి హిట్ అవుతుందని విశ్వసిస్తున్నారు.ఎవరి అంచనాలు ఎలా ఉన్నా అందరూ మంచి ప్రతిభ గల దర్శకులతోనే సినిమాలు చేస్తున్నారు కాబట్టి ప్రతి సినిమా కచ్చితంగా అలరిస్తుందని చెప్పుకోవచ్చు.

దీనివల్ల సినిమా ప్రేక్షకులు ఈ ఏడాది చాలా వినోదాన్ని పొందుతారు.

తాజా వార్తలు