కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఎంతోమంది వైద్యనిపుణులు కరోనా వైరస్ ని నివారించడానికి మార్గంగా మొహానికి మాస్కు ధరించాలి అని చెబుతూ రావడం మనం గమనిస్తూనే ఉన్నాం.నిజానికి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రెండే రెండు మార్గాలు ఉన్నాయి.
అందులో మొదటిది మొహానికి మాస్క్ ధరించడం, అలాగే మనిషి మనిషికి భౌతిక దూరం పాటించడం.అయితే ఈ కాలంలో కరోనా వ్యాధి కాస్త తగ్గిపోయిందని మాస్క్ ను పక్కన పెట్టేశారు ఎంతోమంది.
అయితే కొందరు మాత్రం తూతూమంత్రంగా ఈ మాస్క్ ధరించాం అంటే ధరించాం అన్నట్లుగా పెట్టుకుంటున్నారు.ఇక ఇదిలా ఉండగా తాజాగా కొందరు నిపుణులు ప్రపంచవ్యాప్తంగా సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని కొందరు నిపుణులు చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో భాగంగా తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ మాస్క్ ను ఎలా ఉపయోగించాలో అన్న విషయంపై ఓ వీడియోని సోషల్ మీడియా మాధ్యమంగా చేసుకుని విడుదల చేసింది.అందులో మాస్కులు ఎలా ఉపయోగించాలి, ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అన్న వాటిపై డబ్ల్యూహెచ్ఓ కొన్ని హెచ్చరికలను తెలిపింది.
ముఖ్యంగా ఫ్యాబ్రిక్ మాస్క్ లను ఎలా ఉపయోగించాలో తెలిపింది.అంతేకాదు మాస్క్ లను సురక్షితంగా ఉపయోగించకపోతే ప్రమాదం పొంచి ఉన్నట్లు అని చెప్పుకొచ్చింది.
ఇకపోతే డబ్ల్యుహెచ్ఓ చేసిన సూచనలు ఏవో ఓసారి చూద్దామా.ఇందులో భాగంగా మాస్క్ ను తలకిందులుగా అసలు పెట్టుకోకూడదు, అలాగే వదులుగా ఉండకుండా చూసుకోవాలి.
వీటితోపాటు ముక్కు, నోటి భాగాలను మాస్క్ కవర్ చేసే విధంగా ఉండాలి.ఈ రెండిటికీ కిందికి మాస్క్ రాకూడదు.
ముఖ్యంగా ఎవరితో అయినా సంభాషణ జరిపేటప్పుడు వారి మాస్క్ తీసి మాట్లాడకూడదు.మాస్క్ కు ముందు భాగాన్ని చేతితో తాకకూడదని పొరపాటున కిందకు జారిన కూడా దానికి అనుగుణంగా మాస్క్ ను సరిచేసుకోవాలని తెలిపింది.
ముఖ్యంగా వేరే వారు వాడిన మాస్క్ లను అసలు వాడకూడదని హెచ్చరించింది.