మునుగోడులో మునిగేది ఎవరూ తేలేది ఎవరు?

మునుగోడు ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా కావడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రెస్టేజ్ గా తీసుకున్నాయి.

మునుగోడు అభివృద్ధి కోసమే తెలంగాణలో కొనసాగుతున్న కుటుంబ పాలన అంతమొందించేందుకే తాను రాజీనామా చేశానని ప్రకటించిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరారు.

కెసిఆర్ ప్రభుత్వాన్ని గద్ద దించాలంటే బిజెపితోనే సాధ్యమని అందుకే తాను భారతీయ జనతా పార్టీలో చేరుతున్నానని తెలంగాణ రాష్ట్రం నుండి కల్వకుంట్ల కుటుంబాన్ని గద్దె దించాలంటే తనతో కలిసి రావాలని మునుగోడు నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు.మునుగోడుపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు.

పది రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం మునుగోడు ఉప ఎన్నికపై దృష్టి సారించిన విషయం తెలిసింది.ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ లతోపాటు ప్రజా ప్రతినిధులతో ప్రత్యేక సమావేశమై చర్చలు జరిపారు.

మునుగోడు పోయి ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దింపాలన్న సమాలోచనలు జరిపినట్లు సమాచారం.మునుగోడు పేనికల్లో ప్రచార వ్యూహం మండలాల ఇన్చార్జిల నియామకంపై చర్చించారు.

Advertisement

మునుగోడు ఉప ఎన్నికల్లో నోటిఫికేషన్ కంటే ముందే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.ఎట్టి పరిస్థితుల్లోనైనా మునుగోడులో టిఆర్ఎస్ అభ్యర్థి గెలిచేందుకు అన్ని రకాల శక్తి యుక్తులు చేయాలని పార్టీ శ్రేణులకు సీఎం సూచించినట్టు తెలిసింది.

టిఆర్ఎస్ కు ప్రతిష్టాత్మకంగా మారింది దుబ్బాక హుజురాబాద్ ఉప ఎన్నికల తర్వాత వస్తున్న మునుగోడు ఉప ఎన్నిక టిఆర్ఎస్ కు సవాల్ విసురుతుంది.ఇది కాంగ్రెస్ సిట్టింగ్ సీటు అయిన వచ్చే సార్వత్రిక ఎన్నికలకు బైబుల్ ప్రీఫైనల్ కావడంతో టిఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారింది.హుజురాబాద్ ఉప ఎన్నికల్లో హడావిడి చేసిన టిఆర్ఎస్ మునుగోడు బైపూర్లో సైలెంట్ గా వ్యూహాన్ని అమలు చేయాలని చూస్తోంది.

హుజురాబాద్ ఉప ఎన్నికలు జరిగే ముందు స్కీములు ప్రకటించడంతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ముఖ్య నేతలను టిఆర్ఎస్ గ్రౌండ్ లో దింపింది హుజూర్ నగర్ నాగార్జునసాగర్ లో అమలుపరిచిన వ్యూహాన్ని మునుగోడులో అమలు చేయాలని టీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.అభివృద్ధి ఎంపికలో కూడా హుజూర్ నగర్ లో అమలు చేసిన వ్యూహాన్ని రిపీట్ చేస్తే ఎలా ఉంటుందన్న అంశంపై పార్టీ అధిష్టానం సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది.2018 సార్వత్రిక ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి శానంపూడి సైదిరెడ్డి పోటీ చేసి కొద్ది ఓట్లతో ఓడిపోయారు.2019 ఉత్తంకుమార్ రెడ్డి నల్గొండ లోక్సభ నుంచి ఎంపీగా గెలుపొందినందుకు వచ్చిన హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో మళ్ళీ సైదిరెడ్డి కే టికెట్ ఇచ్చారు.సీఎం కేసీఆర్ గతంలో ఓడించామని సింపతి వర్కర్ కావడంతో ఉత్తంకుమార్ రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డి పై సానంపూడి సైదిరెడ్డి గెలుపొందారు.

మునుగోడులో 2018లో ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి పై ఓడిపోయిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కే టికెట్ ఇస్తే హుజూర్ నగర్ లో రిజల్ట్ రిపీట్ అవుతుందన్న కోణంలో టిఆర్ఎస్ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

సింప్లిసిటీకి పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ ప్రభాస్‌.. వైరల్ అవుతున్న శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Advertisement

తాజా వార్తలు