కరోనా నేపధ్యంలలో సైంటిఫిక్ థ్రిల్లర్ తో రాబోతున్న పలాస హీరో

లండన్ బాబులు సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చి పలాస 1978తో హీరోగా, నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రక్షిత్‌ తన మూడో సినిమాని అనౌన్స్ చేశాడు.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తుంది.

ఈ నేపధ్యంలో చాలా మంది కరోనా వైరస్ ఎలిమెంట్ తో కథలు సిద్ధం చేసుకొని సినిమాలు తెరకెక్కించే పనిలో పడ్డారు.ఇప్పుడు యువ హీరో రక్షిత్ కూడా కరోనా కథాంశంతోనే తన నెక్స్ట్ సినిమా ప్లాన్ చేశాడు.

ఈ సినిమాకి డబ్ల్యు హెచ్‌ ఓ (వరల్డ్‌ హజార్డ్‌ ఆర్డినెన్స్‌) అనే టైటిల్‌ని కన్ఫర్మ్ చేస్తూ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.కరోనా వైరస్ ని ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడం వెనుక చైనా‌ ఎలాంటి కుట్ర చేసిందే ఎలిమెంట్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుంది.

హ్యాకింగ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో సైంటిఫిక్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా కథనం ఉండబోతుంది అని తెలుస్తుంది.ఇక సినిమా ఫస్ట్ లుక్ ద్వారానే కథాంశం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని దర్శకుడు రివీల్ చేశాడు.

Advertisement

ఈ మూవీని సుధాస్‌ మీడియా సమర్పణలో భారీ బడ్జెట్ తో తెరకేక్కబోతుంది.హాలీవుడ్‌ షార్ట్‌ ఫిలింతో విమర్శకుల ప్రశంసలతో పాటు అంతర్జాతీయ గుర్తింపు పొందిన దేవ్‌ పిన్నమరాజు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.

ఈ సినిమా షూటింగ్‌ను అమెరికా, ఇటలీ, సౌత్‌ ఆఫ్రికా, ఇండియా-చైనా బార్డర్‌లో చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు చిత్రయూనిట్‌ తెలిపింది.అయితే కరోనా ఇంతగా విస్తరిస్తున్న సమయంలో విదేశాలలో ఈ సినిమా షూటింగ్ చేయడం కంటే కాస్తా కష్టమైన పని అని చెప్పాలి.

మరి ఎప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది అనేది వేచి చూడాలి.

సొంత ఇంటి కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభ.. ఫోటోలు వైరల్!
Advertisement

తాజా వార్తలు