త్వరలో సంగీత ప్రపంచంలో ఆత్మహత్యలు... సింగర్ సంచలన కామెంట్స్

బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ కొత్త వాళ్ళకి అవకాశాలు దూరం చేస్తున్న మాఫియా, కేవలం సెలబ్రిటీ కుటుంబాల నుంచి వచ్చిన వారు మాత్రమే గొప్పవాళ్ళు అంటూ వాళ్ళ చుట్టూనే ప్రదక్షిణలు చేయడం వాళ్లకి అనుకూలంగా ఉండేవారికి అవకాశాలు ఇవ్వడం.

కొత్తవారికి అవకాశాలు దూరం చేయడం చేస్తున్నారని చాలా మంది సెలబ్రిటీలు ఇప్పుడు బయటకొచ్చి చెబుతున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు స్టార్ గాయకుడు సోనూ నిగమ్ మరో కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చారు.కేవలం నటులకి మాత్రమే కాకుండా బాలీవుడ్ మ్యూజిక్ ఇండస్ట్రీలో కూడా మాఫియా నడుస్తుందని సంచలన వాఖ్యలు చేశారు.

త్వరలో మ్యూజిక్ ఇండస్ట్రీలో కూడా సూసైడ్‌ల గురించి వింటారని చెప్పాడు.కేవలం రెండు కంపెనీలు మ్యూజిక్ ఇండస్ట్రీని శాసిస్తున్నాయని చెప్పుకొచ్చాడు.

ఎవరు పాడాలో, వద్దో ఆ రెండు కంపెనీలే నిర్ణయిస్తాయని చెప్పాడు.మ్యూజిక్ ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీ కంటే పెద్ద మాఫియాలు ఉన్నాయని వ్యాఖ్యానించాడు.

Advertisement

ఇప్పుడు ఇతని వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.స్టార్ సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్న సోనూ నిగమ్ లాంటి వ్యక్తికి అవకాశాలు లేకుండా చేస్తున్నారు అంటే ఇప్పుడు బాలీవుడ్ సంగీత ప్రపంచంలో అలా అవకాశాలు కోల్పోయిన సింగర్లు ఎంత మంది ముందుకొచ్చి తన గొంతు వినిపిస్తారు అనేది ఇప్పుడు చూడాలి.

సొంత ఇంటి కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభ.. ఫోటోలు వైరల్!
Advertisement

తాజా వార్తలు