Bhagavanth Kesari:ఆ సినిమా ముసలోడికే సెట్ అవుతుందంటూ భగవంత్ కేసరి సినిమాకి నో చెప్పిన స్టార్ హీరో.. ఎవరంటే..?

సినిమా ఇండస్ట్రీ అన్నాక ఓ హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేతిలోకి,అలాగే ఒక హీరోయిన్ చేయాల్సిన పాత్ర మరో హీరోయిన్ చేతిలోకి వెళ్లడం సర్వసాధారణం.

కేవలం హీరో,హీరోయిన్స్ మాత్రమే కాకుండా విలన్లు,క్యారెక్టర్ ఆర్టిస్టులు, అలాగే దర్శక నిర్మాతలు,మ్యూజిక్ డైరెక్టర్లు( Music directors ) కూడా అప్పుడప్పుడు మారుతూ ఉంటారు.

కొంతమంది అయితే సినిమా విషయంలో విభేదాలు రావడంతో మధ్యలోనే డ్రాప్ అయినా సందర్భాలు ఎన్నో ఉన్నాయి.ఆ తర్వాత సినిమా మొత్తం మళ్లీ రీ షూట్ చేసిన సంఘటనలు కూడా చాలానే ఉన్నాయి.

అయితే ఈ మధ్యకాలంలో చాలామంది డైరెక్టర్లు తమ సినిమాలు హిట్ అయితే మొదట ఈ సినిమా కథని వేరే హీరోలకు చెప్పామని బహిరంగంగానే బయట పెడుతున్నారు.ఇప్పటికే ఎంతోమంది డైరెక్టర్లు హీరోల విషయంలో ఇది బయటపడింది.అయితే తాజాగా భగవంత్ కేసరి ( Bhagavanth Kesari ) సినిమా గురించి కూడా ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది.

అదేంటంటే.అనిల్ రావిపూడి ( Anil ravipudi ) భగవంత్ కేసరి సినిమాని ముందుగా రాసుకుంది బాలకృష్ణ కోసం కాదట.

Advertisement

మరో స్టార్ హీరో కోసమట.ఇక ఈ సినిమా కథ మొత్తం రాసుకొని ఆ స్టార్ హీరో దగ్గరికి అనిల్ రావిపూడి కథ చెబుదామని వెళ్లారట.

అయితే కథ మొత్తం విన్నాక ఆ స్టార్ హీరో మాత్రం తనకి కథ నచ్చింది కానీ ఇది ముసలోడి సినిమా అని, కేవలం ముసలి హీరోకి మాత్రమే ఈ మూవీ సెట్ అవుతుంది అంటూ అనిల్ రావిపూడి ని నొప్పించకుండా సున్నితంగా రిజెక్ట్ చేశారట.

కానీ అనిల్ రావిపూడి మాత్రం వెనకడుగు వేయకుండా ఈ సినిమాని నందమూరి బాలకృష్ణ ( Nandamuri Balakrishna ) తో తీశారు.ఇందులో కాజల్ అగర్వాల్, శ్రీలీల హీరోయిన్స్ గా చేస్తున్నారు.అయితే అనిల్ రావిపూడి తన సన్నిహితుల దగ్గర భగవంత్ కేసరి సినిమా గురించి బయట పెట్టడంతో ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది.

ఏది ఏమైనా భగవంత్ కేసరి ( Bhagavanth Kesari ) సినిమాకు సంబంధించి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్, టీజర్ వంటివి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి.ఇక ఈ సినిమా కూడా హిట్ అవుతుంది అని అభిమానులు గట్టి నమ్మకం పెట్టుకున్నారు.

వైరల్ వీడియో : శివసేన నేతపై.. కత్తులతో దాడి చేసిన నిహాంగులు..
ఆ విధంగా జరగకపోతే ప్రమాదంలో కళ్యాణ్ రామ్ కెరీర్.. ఆ రేంజ్ హిట్ అందుకుంటారా?

ఇక భగవంత్ kesarసినిమా అక్టోబర్ 19 న దసరా కానుకగా విడుదల కాబోతుంది.

Advertisement

తాజా వార్తలు