తెలుగు సినిమా ఇండస్ట్రీలో బయోపిక్‌ల టైం నడుస్తోంది.ప్రస్తుతం ‘జార్జ్‌రెడ్డి’ అనే చిత్రం గురించి అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఎందుకంటే తెలంగాణలోని అతి పెద్ద యూనివర్శిటీ అయిన ఉస్మానియా యూనివర్శిటీలోని ఏ చెట్టును, పుట్టను అడిగినా కూడా జార్జ్ రెడ్డి అనే వ్యక్తి గురించి చెప్తాయి అనడంలో సందేహం లేదు.ఎందుకంటే అతడు కేవలం వ్యక్తి మాత్రమే కాదు, అతడు ఒక విప్లవం అనడంలో ఎలాంటి సందేహం లేదు అంటూ ఆయన సన్నిహితులు చెబుతూ ఉంటారు.

విద్యార్థుల సమస్యల నుండి అన్ని జాతుల సమస్యల వరకు పోరాటం సాగించిన వ్యక్తి జార్జ్ రెడ్డి.ఆయన గురించి బయటకు తక్కువ వచ్చింది కాని ఆయన చేసిన పనులు ఆందోళనలు గురించి ఆయన తోటి విద్యార్థులను అడిగితే తెలుస్తుంది.అప్పటి యూనివర్శిటీలో జార్జ్ రెడ్డి ఒక ప్రభంజనం.ఆయన వల్ల ఎన్నో సంస్కరణలు వచ్చాయి.అలాంటి జార్జ్ రెడ్డి వల్లే ఇప్పుడు పిల్లలు ఎంతో మంది ఉన్నత చదువులు చదువుతున్నారు.

ఆయన్ను కొందరు ప్రత్యర్థులు ఒంటిపై ఏకంగా 60 కత్తి పోట్లతో చంపేశారు.మూడు పదుల వయసు కూడా రాకుండానే ఆయన గొప్ప పోరాట యోధుడిగా నిలిచాడు.అదే పోరాటంలో భాగంగా మృతి చెందాడు.
అలాంటి వ్యక్తి గురించిన సినిమాను తీయడంతో అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.