డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో అరుదైన ఘటన.. వేద మంత్రాలతో ప్రారంభమైన సభ, ఆ పూజారి ఎవరు..?

అమెరికా అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్న సంగతి తెలిసిందే.

అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధిగా కమలా హారిస్‌ను( Kamala Harris ) అధికారికంగా ప్రకటించేందుకు గాను చికాగో వేదికగా డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్( Democratic National Convention ) జరుగుతోంది.

ఇప్పటికే అధ్యక్షుడు బైడెన్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అతని సతీమణి మిచెల్ ఒబామా తదితర కీలక నేతలు కమలా హారిస్‌కు మద్ధతు ప్రకటించారు.ఓపీనియన్ పోల్స్, ముందస్తు సర్వేల్లో దూసుకెళ్తున్న కమల.మరింతగా మద్ధతును కూడగట్టేందుకు పావులు కదుపుతున్నారు.

నల్లజాతి, దక్షిణాసియా, భారత సంతతి కమ్యూనిటీలు కమలా హారిస్ వెంట నడుస్తున్నట్లుగా అమెరికన్ మీడియా చెబుతోంది.అమెరికాలో బలమైన శక్తిగా ఉన్న హిందువుల ఓట్లను కూడా పొందేందుకు డెమొక్రాటిక్ పార్టీ వ్యూహకర్తలు కొత్త కొత్త ప్రణాళికలను రచిస్తున్నారు.ఈ నేపథ్యంలో డెమొక్రాట్ నేషనల్ కన్వెన్షన్‌లో ఆసక్తికర సంఘటన జరిగింది.

మూడో రోజు కన్వెన్షన్ ప్రారంభం కావడానికి ముందు హిందూ సాంప్రదాయం ప్రకారం వైదిక ప్రార్ధనలు( Vedic Prayers ) నిర్వహించారు.

Advertisement

అమెరికా ఐక్యతను కోరుతూ రాకేష్ భట్( Rakesh Bhatt ) సంస్కృత శ్లోకాలు, మంత్రాలు పఠిస్తూ భగవంతుడి ఆశీర్వచనాలు కోరారు.ఇలా హిందూ సాంప్రదాయంలో సమావేశాన్ని ప్రారంభించడం డెమొక్రాటిక్ పార్టీ హిస్టరీలో ఇదే తొలిసారి.మేరీల్యాండ్‌లోని శ్రీ శివ విష్ణు ఆలయంలో పూజారిగా రాకేష్ భట్ విధులు నిర్వర్తిస్తున్నారు.

ఉడిపి అష్ట మఠానికి చెందిన పెజావర్ స్వామిజీ వద్ద ఆయన శిష్యరికం చేశారు.ఉడిపిలో కొన్నేళ్లు పనిచేసిన తర్వాత భారత్‌లోని ప్రముఖ ఆలయాలైన బద్రీనాథ్, రాఘవేంద్ర స్వామి కోయిల్, సేలంలో పనిచేశారు.2013 జూలైలో మేరీల్యాండ్‌లోని శ్రీ శివ విష్ణు ఆలయంలో చేరారు.తెలుగు, తమిళ, కన్నడ, తుళు, హిందీ, ఇంగ్లీష్ , సంస్కృతంలో రాకేష్ భట్ అనర్గళంగా మాట్లాడగలరు.

భారతీయ సాంస్కృతిక, ఆధ్యాత్మిక సాంప్రదాయాలకు ఇంతటి ప్రతిష్టాత్మక వేదికపై గౌరవం లభించడం ఆనందంగా ఉందని హిందూ అమెరికన్లు చెబుతున్నారు.

లెక్కలేనన్ని లింకులతో పాన్ ఇండియా సినిమాలు... లెక్క తప్పితే అంతే మరి!
Advertisement

తాజా వార్తలు