మనలో టాలెంట్ ఉంటే అవకాశాలు అవే వెతుక్కుంటూ వస్తాయి అని చెప్పడానికి నటుడు ప్రకాష్ రాజ్ జీవితమే ఒక ఉదాహరణ.ప్రకాష్ రాజ్ అసలు పేరు ప్రకాష్ రాయ్ అతడు మొదటిసారిగా సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది దర్శకుడు బాల చందర్ వల్ల.
అయితే ప్రకాష్ రాజ్ ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి దర్శకుడు బాల చందర్ వేసిన పునాది కారణమైతే బాల చందర్ లాంటి దర్శకుడు చేతిలో ప్రకాష్ రాజ్ పడితే ఒక ఆణిముత్యం లాంటి నటుడవుతావని భావించింది మాత్రం నటి గీత.బెంగళూరులో చిన్న చిన్న వేషాల్లో, ఆర్ట్ ఫిలిమ్స్ లో మరియు స్టేజ్ ప్రోగ్రామ్స్ లో నటిస్తున్న ప్రకాష్ రాజ్ నీ చూడగానే గీత మరియు లక్ష్మీ వంటి సీనియర్ నటిమణులు వీడు పెద్ద స్టార్ అయిపోతాడు అని జోష్యం చెప్పారట.
కన్నడలో ఒక ఆర్ట్ ఫిలిం లో నటిస్తున్న గీతకు తోటి నటుడుగా ప్రకాష్ రాజ్ నటించాడు.అయితే గీత ప్రకాష్ రాజ్ ఫోటోలు తీయించి బాల చందర్ కి తీసుకెళ్లి చూపించారట.
అప్పటికే గీత మంచి స్థాయిలో ఉంది కాబట్టి ఒక ఆర్ట్ ఫిలిం లో నటించే నటుడిని ఎందుకు పరిచయం చేస్తుందా అని తెలుసుకోవడం కోసం ప్రకాష్ రాజ్ ని మద్రాస్ పిలిపించుకున్నాడట బాలచందర్.ప్రకాష్ రాజ్ కళ్ళు చూడగానే నువ్వు చాలా బాగున్నావు నీ కళ్ళు నటిస్తున్నాయి నా సినిమాలో నటిస్తావా అంటూ ఆఫర్ ఇచ్చారట.
అయితే అప్పటికే తీస్తున్న సినిమాలో ప్రకాష్ రాజుకు బదులు కొన్ని కారణాల వల్ల వేరే నటుడిని పెట్టుకోవడంతో ప్రకాష్ తిరిగి వెళ్లిపోయాడట.ఆ తర్వాత ఎనిమిది నెలలకు డ్యూయెట్ అనే సినిమా తీస్తున్న సమయంలో చాలా కష్ట పడి ప్రకాష్ రాజ్ నెంబర్ సంపాదించి బాలచందర్ ఫోన్ చేసి మరీ అతడిని పిలిపించాడట.

అలా మొదటిసారిగా డ్యూయెట్ సినిమా ద్వారా సౌత్ ఇండియా సినిమా కి పరిచయమయ్యాడు ప్రకాష్ రాజ్.అయితే అతడు పేరు మార్చాలని బాల చందర్ భావించాడట మణి ప్రకాష్ అని మొదట పెట్టాలనుకున్నా అందుకు ప్రకాష్ రాజ్ ఒప్పుకోకపోవడంతో రాయ్ స్థానం లో రాజ్ అని పెట్టి పరిచయం చేశాడట.మొదటి సారి పేరు మార్చుకోవడానికి ప్రకాష్ రాజ్ సిద్ధపడకపోవడంతో రజనీకాంత్ లాంటి వ్యక్తి పేరు నేను మర్చేసాను నువ్వెంత రా అంటూ తమాషా చేశాడట బాల చందర్.బాల చందర్ దృష్టిలో ఒక నటుడి పేరు ఒక రిలీజియన్ కి లేదా ఒక ప్రాంతానికి పరిమితం కాకూడదు అని అనుకునేవారు.







