టాలీవుడ్ లో చాలామంది హీరోలకి బ్రదర్స్, సిస్టర్స్ ఉన్నప్పటికి లోప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు.అలాగే హీరో అడవి శేష్ కి సైతం ఒక బ్రదర్ ఉన్నాడనే విషయం ఎవరికి తెలియదు.
అతడు సాదాసీదా వ్యక్తి కూడా కాదు టాలీవుడ్ లోనే మంచి డైరెక్టర్ అనే విషయం తక్కువ మందికి తెలుసు.అంతేకాదు అడవి శేష్ ని హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ రోజు ఈ స్థాయిలో గుర్తించడానికి గల కారణం కూడా అతని అన్నయ్య అని తెలుస్తోంది.
మరి అడవి శేషు బ్రదర్ ఎవరు? ఇండస్ట్రీలో ఏం చేస్తున్నాడు ? ఎన్ని సినిమాలు తీశాడు ? అనే విషయాలను ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అడవి శేష్ కి సొంతంగా అన్నయ్యలు, తమ్ముళ్లు ఎవరూ లేరు.
కానీ పెద్దమ్మ కొడుకు అయినటువంటి సాయి కిరణ్ అడవి, మొదటి నుంచి శేష్ ని బాగా ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు.సాయి కిరణ్ అడవి తెలుగులోనే మంచి దర్శకుడు తొలుత శేఖర్ కమ్ముల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు.
ఆ తర్వాత 2008లో నటుడు కృష్ణుడిని హీరోగా చేస్తూ వినాయకుడు అనే సినిమా తీసి ఘన విజయం సాధించాడు.ఈ సినిమాకి తనే కథను రాసి, దర్శకత్వం వహించాడు.

ఈ సినిమాకు గాను బెస్ట్ డైరెక్టర్ నంది అవార్డు కూడా అందుకున్నాడు.ఆ తర్వాత 2009లో వినాయకుడి చిత్రానికి సీక్వెల్ గా విలేజ్ లో వినాయకుడు అంటూ సినిమా తీసి దాన్ని కూడా విజయవంతం చేయడంలో సాయి కిరణ్ ఎంతో ప్రతిభను చాటుకున్నాడు.విలేజ్ లో వినాయకుడు సినిమాతో సాయి కిరణ్ నిర్మాతగా కూడా మారాడు.అప్పటి నుంచి తన సినిమాలను తానే నిర్మించుకుంటూ, కథలు రాస్తూ, దర్శకత్వం కూడా చేస్తున్నాడు.

ఇక 2013లో అడవి శేషుని హీరోగా పెట్టి కిస్ అనే రొమాంటిక్ సినిమా తీశాడు.ఈ సినిమా యావరేజ్ గా ఆడింది.ఈ సినిమాకి సాయి కిరణ్ నిర్మాతగా వ్యవహరించాడు.ఆ తర్వాత టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ కేరింత సినిమాను దర్శకత్వం వహించగా ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు.
ఇక 2019లో ఆపరేషన్ గోల్డ్ ఫిష్ అనే సినిమాని కూడా తీశాడు.ఈ చిత్రం పెద్దగా ఆడకపోయినా దర్శకుడుగా సాయి కిరణ్ కి మంచి గుర్తింపు లభించింది.
ప్రస్తుతం మరికొన్ని కథలు రాసే పనిలో ఉన్నాడు సాయికిరణ్.







