నిలిచిన ఆక్స్‌ఫర్డ్ ట్రయల్స్: నిరుత్సాహపడొద్దన్న భారత సంతతి శాస్త్రవేత్త సౌమ్యా స్వామినాథన్

ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్‌ను నియంత్రించే వ్యాక్సిన్ కోసం శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

అయితే వ్యాక్సిన్ రేసులో ముందుందని భావిస్తున్న ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనికా సంయుక్తంగా తయారు చేసిన టీకాను వేయించుకున్న ఓ వాలంటీరుకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ప్రయోగాలు నిలిచిపోయాయి.

బ్రిటన్ లో టీకా తీసుకున్న వ్యక్తి తీవ్ర అనారోగ్యం బారిన పడటంతో, తుది దిశకు చేరిన క్లినికల్ ట్రయల్స్ ను నిలిపివేశామని, వ్యాక్సిన్ భద్రతపై మరోమారు పూర్తిస్థాయిలో సమీక్షిస్తామని ఆస్ట్రాజెనికా ఓ ప్రకటనలో తెలిపింది.మరోవైపు ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ‘‘ కోవిషీల్డ్’’ తీసుకున్న వాలంటీర్‌లో నరాల సమస్యలు తలెత్తడంతో దాని సమర్థతపై అనేక సందేహాలు వస్తున్నాయి.

సమస్యకు కారణం టీకానేనా, లేక ఏదైనా అంశమా అన్నది స్పష్టం చేయాలని ప్రపంచవ్యాప్తంగా వున్న శాస్త్రవేత్తలు ఆస్ట్రాజెనెకాను కోరుతున్నారు.

ఈ పరిణామంతో ఆక్స్‌ఫర్డ్ టీకాపై గంపెడాశలు పెట్టుకున్న వారంతా నిరాశకు గురయ్యారు.వ్యాక్సిన్ వచ్చేస్తుందని ఇక ఢోకా లేదని భావిస్తున్న తరుణంలో ఆక్స్‌ఫర్డ్ ప్రకటన ఇలాంటి వారికి శరాఘాతంలా తగిలింది.ఈ నేపథ్యంలో టీకా అభివృద్ధిలో ఎత్తు పల్లాలు ఉంటాయని, ఇదో హెచ్చరిక లాంటిదని ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్, భారత సంతతికి చెందిన సౌమ్యా స్వామినాథన్.

Advertisement

జెనీవాలో జరిగిన వర్చువల్ మీడియా సమావేశంలో ఆక్స్‌ఫర్డ్ ట్రయల్స్ నిలిచిపోవడంపై ఆమె స్పందించారు.ఎవ్వరూ నిరుత్సాహపడవద్దని.

ఇలాంటివి సహజమని అన్నారు.అంతకుముందు ఓ సమావేశంలో మాట్లాడిన సౌమ్య .వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ 2021 ద్వితీయార్థం వరకు దానిని భారీ స్థాయిలో పంపిణీ చేసే అవకాశం ఉండకపోవచ్చునని అభిప్రాయపడ్డారు.ప్రపంచవ్యాప్తంగా మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు చేరుకున్న వ్యాక్సిన్ల పూర్తి స్థాయి ఫలితాలు ఈ ఏడాది చివరి నాటికి రావొచ్చన్నారు.

అన్ని అనుమతులు లభించి వ్యాక్సిన్‌ ఉత్పత్తి జరగడానికి సమయం పట్టే అవకాశం వుందని సౌమ్యా వ్యాఖ్యానించారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు