ఈ ఆకులతో తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.. తెలుసా?

బిళ్ళ గన్నేరు.( Billa Ganneru ) పల్లెటూర్లలో దాదాపు ప్రతి ఒక్కరి ఇంటి పెరట్లో ఉండే మొక్కల్లో ఇది ఒకటి.

ఈ మొక్క పువ్వులు వైట్ మరియు పింక్ కలర్ లో ఉంటాయి.బిళ్ళ గన్నేరు పువ్వులను పూజకు ఉపయోగిస్తారు.

అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.బిళ్ళ గన్నేరు ఒక ఔషధ మొక్క.

ఈ మొక్క నుంచి వచ్చే పువ్వులు, ఆకులు, కొమ్మలు అన్నిటిలోనూ అనేక ఔషధ గుణాలు దాగి ఉంటాయి.ముఖ్యంగా బిళ్ళ గన్నేరు ఆకులతో తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

Advertisement

ఇటీవల రోజుల్లో ఎంతోమంది వైట్ హెయిర్( White Hair ) సమస్యతో బాధపడుతున్నారు.వైట్ హెయిర్ అనేది వృద్ధాప్యానికి సంకేతం.

ఈ నేపథ్యంలోనే తెల్ల జుట్టును నల్లగా మార్చుకునేందుకు ఆర్టిఫిషియల్ కలర్స్ పై ఆధార పడుతున్నారు.అయితే బిళ్ళ గన్నేరు ఆకులు సహజంగానే తెల్ల జుట్టును నల్లగా( Black Hair ) మారుస్తాయి.

అందుకోసం మనం వాటిని ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా మీ చుట్టుపక్కల ఉన్న పరిసరాల నుంచి బిళ్ళ గన్నేరు ఆకులను సేకరించి వాటర్ తో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో బిళ్ళ గన్నేరు ఆకులు వేసి కొద్దిగా వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ సపరేట్ చేసుకోవాలి.

వైరల్ వీడియో : నెటిజన్లను మంత్రముగ్ధుల్ని చేస్తున్న అద్దాల మేడ..
ముగ్గురు హీరోలు 16 సినిమాలు. టాలీవుడ్ బీభత్సం

ఇప్పుడు ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్,( Coconut Oil ) వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్( Lemon Juice ) మిక్స్ చేసి జుట్టు కుదుళ్ల‌ నుంచి చివర్ల వరకు ప‌ట్టించి ఒకటికి రెండుసార్లు బాగా అప్లై చేసుకోవాలి.

Advertisement

45 నిమిషాల అనంతరం తేలికపాటి షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ విధంగా చేశారంటే మీ తెల్ల జుట్టు క్రమంగా నల్లబడుతుంది.వైట్ హెయిర్ తో బాధపడుతున్న వారికి ఈ రెమెడీ అద్భుతంగా సహాయపడుతుంది.

అలాగే ఈ రెమెడీని ప్రయత్నించడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ గా మారతాయి.

మరియు జుట్టు రాలే సమస్య సైతం దూరం అవుతుంది.

తాజా వార్తలు