చుట్టమల్లే వర్సెస్ కిస్సిక్ వర్సెస్ నానా హైరానా.. మూడు సాంగ్స్ లో బెస్ట్ సాంగ్ ఇదేనా?

ఈ ఏడాది విడుదలైన భారీ బడ్జెట్ సినిమాల పాటలలో చుట్టమల్లే, కిస్సిక్, నానా హైరానా పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఈ మూడు సాంగ్స్ లో బెస్ట్ సాంగ్ ఏదనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది.

దేవర,( Devara ) పుష్ప2,( Pushpa 2 ) గేమ్ ఛేంజర్( Game Changer ) సినిమాలకు వేర్వేరు మ్యూజిక్ డైరెక్టర్లు పని చేసిన సంగతి తెలిసిందే.యూట్యూబ్ లో ఈ 3 పాటలకు రికార్డ్ స్థాయిలో వ్యూస్ రావడం గమనార్హం.

అయితే ప్రస్తుతం ఏ సర్వేలో చూసినా ఎక్కువమంది నానా హైరానా సాంగ్ కు( Naanaa Hyraanaa Song ) ఎక్కువగా ఓటేస్తున్నారు.గేమ్ ఛేంజర్ సినిమాపై అంచనాలను పెంచడంలో ఈ సాంగ్ కీలక పాత్ర పోషించిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

గేమ్ ఛేంజర్ మూవీ జనవరి 10వ తేదీన థియేటర్లలో విడుదల కానుండగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 1వ తేదీన రిలీజ్ కానుంది.

Advertisement

గేమ్ ఛేంజర్ సినిమా హిట్ గా నిలిచి టాలీవుడ్ ఇండస్ట్రీకి శుభారంభాన్ని ఇవ్వాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.గేమ్ ఛేంజర్ సినిమా ట్రైలర్ విడుదలైన తర్వాత ఈ సినిమా ఏ విధంగా ఉండబోతుందో క్లారిటీ రానుంది.డిసెంబర్ లో పుష్ప ది రూల్ లో జనవరిలో సంక్రాంతి సినిమాలతో థియేటర్లు కళకళలాడటం పక్కా అని చెప్పవచ్చు.

ఈ సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగా రిలీజ్ కానున్నాయి.

గేమ్ ఛేంజర్ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీ దశను మార్చే సినిమా అవుతుందేమో చూడాలి.ఈ సినిమా సక్సెస్ సాధించడం శంకర్ కు( Shankar ) సైతం కీలకమని చెప్పవచ్చు.గత పదేళ్లలో శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలేవీ ప్రేక్షకులను మెప్పించలేదు.

రోబో తర్వాత స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలేవీ ప్రేక్షకులను మెప్పించకపోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

పుష్ప 2 విడుదలపై టీడీపీ ఎంపీ షాకింగ్ పోస్ట్.. వెంటనే డిలీట్.. మాకు సెంటిమెంట్ అంటూ!
Advertisement

తాజా వార్తలు