'చెట్టు ముందా, విత్తు ముందా'.? ఆన్సర్ దొరికేసింది?

ఆదికాలం నుండి విత్తు ముందా చెట్టు ముందా? పక్షి ముందా గుడ్డు ముందా? అనే ప్రశ్నలు మనం వింటూ వున్నాం.

వీటిపైన అనేక డిబేట్స్ నేటికీ జరగడం మనం చూడవచ్చు.

అయితే దీనికి ఎవరు సమాధానం చెప్పలేకపోతున్నారు.ఎందుకంటే చెట్టు ముందంటే.

విత్తు లేనిదే చెట్టు రాదు కదా అంటారు.ఇక విత్తు ముందంటే చెట్టు నుండే విత్తు వస్తుంది కదా? అదెలా సాధ్యం అని అంటూ వుంటారు.అసలింతకీ దేని తరువాత ఏది వస్తుందనే విషయం ఇక్కడ తేల్చుకుందాం.

సనాతన ధర్మం ప్రకారం.మనిషైనా, జంతువైనా, పశు పక్ష్యాదులైనా, చెట్టైనా - పుట్టయినా ఈ చరాచర సృష్టిని అంతటినీ సృష్టించింది బ్రహ్మ అని మనకి ప్రగాఢ విశ్వాసం.

Advertisement

అటువంటి బ్రహ్మ ఒక జీవిని సృష్టించినప్పుడు ఆ జీవికి సంపూర్ణ ఆకృతి కల్పించి ఆపైన ఆ జీవిలో ప్రాణం ప్రవేశ పెట్టినట్లుగా బ్రహ్మ సృష్టిని గురించి మనం ఎల్లప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం.ఈ విధంగా లక్షలాది చరాచర సృష్టిని సృజించిన బ్రహ్మ ఆయా జీవుల పునరుత్పాదన అంటే క్షీరదాలలో పిండం కావచ్చు, పక్షులలో, పాములలో గ్రుడ్డు ద్వారా కావచ్చు, వృక్షాది అచర సృష్టి వాటి విత్తనాల ద్వారా అయ్యేలా వాటికి వరం అనుగ్రహించాడు అని నమ్ముతాం.

కనుక మన పండితులు, ఋషులు అభిప్రాయం ప్రకారం ప్రకారం విత్తనం కంటే చెట్టే ముందు అని నానుడి.ఎలా అని అంటే.క్షీర సాగర మధన సమయంలో లక్ష్మి దేవి, ధన్వంతరి, కామ ధేనువు, కల్ప వృక్షం, ఐరావతం, పారిజాతం మొదలైనవి పూర్తి ఆకారంతో పుట్టినవే అని మనం చదువుకున్నాం.

అలాగే ఓ పూర్తి ఆకారం తయారైన తరువాతే దానినుండి విత్తనం జనిస్తుంది అర్ధం.అందుకే అంటారు విత్తనం కంటే చెట్టే ముందు అని.

కొరియన్ భర్తకి పరీక్ష పెట్టిన ఇండియన్ భార్య.. వీడియో చూస్తే నవ్వే నవ్వు..
Advertisement

తాజా వార్తలు