మా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి 'మెగా'కు ఆహ్వానం అందలేదా!

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ ఎసోసియేషన్ ఎన్నికలు రసవత్తరంగా జరిగిన సంగతి తెలిసిందే.

ఎంతో హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు గెలుపొందిన విషయం తెలిసిందే.

చివరి నిముషం వరకు ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారా అని సాధారణ ప్రజలు సైతం ఎదురు చూసారు.ఈ ఎన్నికల నేపథ్యంలో ఒకరిపై ఒకరు దూషించుకుంటూ ఎన్నికలకు హీట్ పెంచేశారు.

అయితే ఎవరో ఒకరు మాత్రమే గెలవాలి కాబట్టి ఈసారి మంచు విష్ణు ఈ ఎన్నికల్లో మా అధ్యక్ష పదివికి చేపట్టారు.వారం క్రితం జరిగిన ఎన్నికల్లో అధ్యక్ష పదవిని చేపట్టిన మంచు విష్ణు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసారు.

ఫిలిం నగర్ కల్చరర్ సెంటర్ లో ఈ ప్రమాణ స్వీకారం 11 గంటలకు జరిగింది.మంచు విష్ణుతో పాటు తన ప్యానల్ లోని సభ్యులు కూడా ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు.

Advertisement

మంచు విష్ణు ప్రమాణ స్వీకారానికి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ముఖ్య అతిధిగా ఆహ్వానించారు.అంతేకాదు నందమూరి ఫ్యామిలీ ని మోహన్ బాబు, విష్ణు ఇద్దరు కలిసి ఇంటికి వెళ్లి మరి ఆహ్వానించారు.

ఇంకా టాలీవుడ్ సినీ పెద్దలు కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాస్ రావు, పరుచూరి బ్రదర్స్, బ్రహ్మానందం వంటి సినీ పెద్దలకు కూడా ఆహ్వానం అందింది.

అయితే ఇంతమందిని ఆహ్వానించినా విష్ణు మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించలేదని తెలుస్తోంది.ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి మెగా ఫ్యామిలీకి ఆహ్వానం అందలేదని ప్రచారం అయితే జరుగుతుంది.ఇటీవలే మంచు మనోజ్ పవన్ కళ్యాణ్ ను కలిసి ఆహ్వానించారని వార్తలు వచ్చినప్పటికీ ఈ విషయంపై స్పష్టత లేదు.

అయితే మంచు విష్ణు మాత్రం అందరిని కలుపుకొని పోత మెగాస్టార్ కు కూడా ఆహ్వానం అందిస్తానని అన్నారు.కానీ ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ కానీ ప్రకాష్ రాజ్ ప్యానెల్ కానీ దూరం గా ఉన్నారు.మరి నిజంగానే చిరంజీవికి ఆహ్వానం అందలేదా? లేదంటే అందిన రాలేదా అనేది తెలియాలి.

నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?
Advertisement

తాజా వార్తలు