వాట్సాప్ గ్రూప్​ కాల్ అప్​డేట్: ఇక్కడ వాయిస్ కాల్​ మ్యూట్ చేయొచ్చు తెలుసా?

వాట్సాప్ తమ యూజర్లను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తెస్తూ ఉంటుంది.ఈ క్రమంలో తాజాగా గ్రూప్​ కాల్ అప్​డేట్ ఒకటి తీసుకు రానుంది.

 Whatsapp Group Call Update , Whatsapp, Group, Mute Calls, Technology Update, Latest News , Mute Option-TeluguStop.com

ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే గనుక గ్రూప్ కాల్​లో ఉన్నప్పుడు పార్టిసిపెంట్స్​ కాల్​ని మ్యూట్ చేసే వెసులుబాటు ఉంటుందని చెబుతోంది వాట్సాప్ కంపెనీ అధికారిక టీమ్.అంతేకాకుండా వాళ్లకు పర్సనల్​గా మెసేజ్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పంపొచ్చు.

బేసిగ్గా గ్రూప్ కాల్​ చేసినప్పుడు మాట్లాడడం అయిపోయాక కొందరు తమ కాల్​ని మ్యూట్​లో పెట్టడం మర్చిపోతారు.అలాంటప్పుడు గ్రూప్ అడ్మిన్​తో పాటు గ్రూప్​లోని ఎవరైనా వాళ్ల కాల్​ని మ్యూట్​లో పెట్టొచ్చు.

 WhatsApp Group Call Update , Whatsapp, Group, Mute Calls, Technology Update, Latest News , Mute Option-వాట్సాప్ గ్రూప్​ కాల్ అప్​డేట్: ఇక్కడ వాయిస్ కాల్​ మ్యూట్ చేయొచ్చు తెలుసా-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

​మ్యూట్ ఆప్షన్​ మీద నొక్కినప్పుడు మ్యూట్, మెసేజ్ ఆప్షన్లు మనకు కనిపిస్తాయి.కొత్త వెర్షన్​ వాట్సాప్ ఉపయోగిస్తున్న ఆండ్రాయిడ్, IOS యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులో ఉన్నట్టు తెలిపారు.

ఇకపోతే ఈ మధ్య వాట్సాప్ కంపెనీ వివిధ వాట్సాప్ గ్రూప్స్ పైన కొరడా ఝుళిపిస్తుంది.తాజాగా అగ్నిపథ్ పథకం గురించి వాట్సాప్ గ్రూపులలో వస్తున్న సమాచారం విషయంలో పెద్ద రచ్చే జరిగింది.

ఈ విషయమై 35 గ్రూపులను కేంద్రం గుర్తించింది.వీటి ద్వారా తప్పుడు సమాచారం బయటకు వెళ్లిందని, దానివల్లనే హింస జరిగిందని తెలుసుకొని ఈ కేసులో ఇప్పటికే దాదాపు 10 మందిని అరెస్ట్ చేసినట్టు భోగట్టా.

ఇకపోతే, ఇప్పటికే ఉన్న వాయిస్ మెసేజెస్, ఫైల్ షేరింగ్ వంటి ఫెసిలిటీలలో కొత్త ఫీచర్లను తీసుకొచ్చిన సంగతి తెలిసినదే.ఇందులో భాగంగా గ్రూప్ వీడియో కాలింగ్ ఫెసిలిటీకి కూడా వాట్సాప్ మరిన్ని హంగులు దిద్దుతోంది.ఈ క్రమంలోనే మెసేజింగ్ యాప్ ఇప్పుడు గ్రూప్ వీడియో కాల్స్ చేసే అడ్మిన్స్‌ కోసం ఓ కొత్త ఫీచర్‌ను లాంచ్ చేయడం విశేషం.ఈ ఫీచర్‌తోనే వీడియో కాల్ హోస్ట్‌ చేసే యూజర్ కాల్‌లో ఉన్న ఇతర వ్యక్తిని మ్యూట్ చేయవచ్చు.

అంతేకాకుండా, కాల్ కొనసాగుతున్నప్పుడు తమ కాల్‌లో పాటిస్పేట్ చేసిన ఇతరులకు వ్యక్తిగతంగా మెసేజ్ పంపవచ్చు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube