వాట్సాప్ గ్రూప్​ కాల్ అప్​డేట్: ఇక్కడ వాయిస్ కాల్​ మ్యూట్ చేయొచ్చు తెలుసా?

వాట్సాప్ తమ యూజర్లను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తెస్తూ ఉంటుంది.

ఈ క్రమంలో తాజాగా గ్రూప్​ కాల్ అప్​డేట్ ఒకటి తీసుకు రానుంది.

ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే గనుక గ్రూప్ కాల్​లో ఉన్నప్పుడు పార్టిసిపెంట్స్​ కాల్​ని మ్యూట్ చేసే వెసులుబాటు ఉంటుందని చెబుతోంది వాట్సాప్ కంపెనీ అధికారిక టీమ్.

అంతేకాకుండా వాళ్లకు పర్సనల్​గా మెసేజ్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పంపొచ్చు.బేసిగ్గా గ్రూప్ కాల్​ చేసినప్పుడు మాట్లాడడం అయిపోయాక కొందరు తమ కాల్​ని మ్యూట్​లో పెట్టడం మర్చిపోతారు.

అలాంటప్పుడు గ్రూప్ అడ్మిన్​తో పాటు గ్రూప్​లోని ఎవరైనా వాళ్ల కాల్​ని మ్యూట్​లో పెట్టొచ్చు.

​మ్యూట్ ఆప్షన్​ మీద నొక్కినప్పుడు మ్యూట్, మెసేజ్ ఆప్షన్లు మనకు కనిపిస్తాయి.కొత్త వెర్షన్​ వాట్సాప్ ఉపయోగిస్తున్న ఆండ్రాయిడ్, IOS యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులో ఉన్నట్టు తెలిపారు.

ఇకపోతే ఈ మధ్య వాట్సాప్ కంపెనీ వివిధ వాట్సాప్ గ్రూప్స్ పైన కొరడా ఝుళిపిస్తుంది.

తాజాగా అగ్నిపథ్ పథకం గురించి వాట్సాప్ గ్రూపులలో వస్తున్న సమాచారం విషయంలో పెద్ద రచ్చే జరిగింది.

ఈ విషయమై 35 గ్రూపులను కేంద్రం గుర్తించింది.వీటి ద్వారా తప్పుడు సమాచారం బయటకు వెళ్లిందని, దానివల్లనే హింస జరిగిందని తెలుసుకొని ఈ కేసులో ఇప్పటికే దాదాపు 10 మందిని అరెస్ట్ చేసినట్టు భోగట్టా.

"""/" / ఇకపోతే, ఇప్పటికే ఉన్న వాయిస్ మెసేజెస్, ఫైల్ షేరింగ్ వంటి ఫెసిలిటీలలో కొత్త ఫీచర్లను తీసుకొచ్చిన సంగతి తెలిసినదే.

ఇందులో భాగంగా గ్రూప్ వీడియో కాలింగ్ ఫెసిలిటీకి కూడా వాట్సాప్ మరిన్ని హంగులు దిద్దుతోంది.

ఈ క్రమంలోనే మెసేజింగ్ యాప్ ఇప్పుడు గ్రూప్ వీడియో కాల్స్ చేసే అడ్మిన్స్‌ కోసం ఓ కొత్త ఫీచర్‌ను లాంచ్ చేయడం విశేషం.

ఈ ఫీచర్‌తోనే వీడియో కాల్ హోస్ట్‌ చేసే యూజర్ కాల్‌లో ఉన్న ఇతర వ్యక్తిని మ్యూట్ చేయవచ్చు.

అంతేకాకుండా, కాల్ కొనసాగుతున్నప్పుడు తమ కాల్‌లో పాటిస్పేట్ చేసిన ఇతరులకు వ్యక్తిగతంగా మెసేజ్ పంపవచ్చు.

షాకింగ్ వీడియో: భోజనం వడ్డిస్తుండగా కూరలో ప్రత్యక్షమైన పాము.. చివరకు..